Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Feb 2024 09:06 IST

1.తండ్రి ఆటోలో..తనయ ఆటలో

సజీవన్‌ సజన.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2 మొదలయ్యే వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఒకే ఒక్క సిక్సర్‌తో ఈ అమ్మాయి అందరికి పరిచయమైపోయింది. ఆడింది ఒకే బంతి అయినా.. ఒక్క షాట్‌తో ఆమె పేరు మార్మోగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.రోగులకు ఇంటి వద్దే నర్సింగ్‌ సేవలు

వివిధ రకాలైన వ్యాధులకు ఆసుపత్రులలో శస్త్రచికిత్స లేదా ఇతర చికిత్సలు చేయించుకొని ఇంటి దగ్గర కోలుకుంటున్న తరుణంలో రోగులకు అవసరమైన నర్సింగ్‌, ఫిజియో థెరపీ సేవలు అందించే సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు విస్తరిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.కొత్త నేర న్యాయ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి

బ్రిటిష్‌ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌) జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం గెజిట్‌ నోటిఫికేషన్లు వెలువరించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.ఎయిమ్స్‌పైనా జగన్‌ అక్కసు

ఎయిమ్స్‌.. దేశంలోనే అత్యున్నత జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ రాష్ట్రానికి వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే.. అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తారు. సీఎం జగన్‌ మాత్రం వసతులు కల్పించట్లేదు సరికదా.. వాటికి అడుగడుగునా మోకాలడ్డుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.టెట్‌ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద ‘పరీక్ష’

ఎన్నికల ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డీఎస్సీ ప్రకటించిన జగన్‌ సర్కార్‌ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. చదువుకునేందుకు సమయం ఇవ్వలేదని ఒకపక్క అభ్యర్థులు గగ్గోలు పెడుతుండగా.. ఇప్పుడు టెట్‌ పరీక్ష కేంద్రాలను వందల కిలోమీటర్ల దూరంలోని పక్క రాష్ట్రాల్లో కేటాయించి వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.వాలంటీర్లకు తాయిలాల ఎర!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైకాపా నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆ క్రమంలో వాలంటీర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా, వైకాపా మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో... తర్లుపాడు, మార్కాపురం మండలాలకు చెందిన 450 మంది వాలంటీర్లతో శనివారం సమావేశం నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.వైకాపా ఫ్లెక్సీకి పోలీసుల పహారా!

ప్రొద్దుటూరులో తెదేపా ఫ్లెక్సీని తొలగించిన స్థానంలో ఏర్పాటుచేసిన వైకాపా ఫ్లెక్సీకి పోలీసులు పహారా కాశారు. ఫ్లెక్సీల తొలగింపు, ఏర్పాటుపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.కొండగట్టులో ఇంటి దొంగలు!

భక్తులు సమర్పించే కానుకలు, డబ్బులను కాజేసేవారు కొందరైతే.. అడ్డగోలు బిల్లులతో ఆలయ నిధులను స్వాహా చేసేవారు మరికొందరు.. ఏళ్లుగా ఆలయంలో పాతుకుపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. ఉద్యోగులు ఇతర ఆలయాలకు బదిలీ అయినా ఆరు నెలల్లోపే మళ్లీ కొండగట్టుకు వస్తుంటారు. ఎన్ని ఆరోపణలున్నా ఉన్నతాధికారుల అండదండలతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.ఐటీ ఉద్యోగాలు పోయి.. సైబర్‌ మోసాలకు తెరలేపి

ఐటీ సంస్థల్లో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఇద్దరు డబ్బు కోసం సైబర్‌ నేరగాళ్ల అవతారం ఎత్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల్ని మోసం చేస్తూ విలాస జీవితం గడుపుతున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నిందితులే సొంతంగా సైబర్‌ నేరాలు చేస్తూ సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు పట్టుబడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.భాగ్యనగరం.. కల్తీ కలవరం

నగరంలో ఏ వీధిలో చూసినా హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లకు కొదవ లేదు. తీరిక లేని సమయాల్లో.. వారాంతాల్లో చాలామంది ఆహార ప్రియులు వీటిని లొట్టలేసుకొని మరీ తింటుంటారు. వీటి తయారీలో ఉపయోగించే సరకుల నాణ్యత భాగ్యనగర వాసులను కలవర పెడుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని