Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 01 Mar 2024 09:01 IST

1.ముందుంది అసలు సవాల్‌

ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తప్పించడం ద్వారా దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసే ఆటగాళ్లను ఉపేక్షించేది లేదని బీసీసీఐ గట్టి హెచ్చరికే జారీ చేసింది. అయితే ఉన్నట్లుండి బీసీసీఐ ఇంత కఠినంగా వ్యవహరించడంపై భారత క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లను రంజీల వైపు నడిపించడం అంత తేలిక కాదని.. బీసీసీఐకి అసలు సవాల్‌ ముందు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే

చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఫలితంగా.. అవసరమైనప్పుడు బీమా పాలసీ అండగా ఉండలేక పోతోంది. సాధారణంగా క్లెయిం తిరస్కరణకు దారి తీసే సందర్భాలు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.అది మెగా.. ఇది దగా

పొరుగునున్న తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలను వెతికి మరీ భర్తీచేస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం జగన్‌ సర్కార్‌ ఉన్న ఖాళీలను దాచేసి, నిరుద్యోగులను మోసగిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఏటా డీఎస్సీ నిర్వహించిందా అంటే.. అదీ లేదు. రాబోయే నెలల్లో పదవీవిరమణలు విరివిగా ఉంటాయి. కానీ, ప్రభుత్వం 6,100 పోస్టులకు డీఎస్సీ ఇచ్చి.. ఇక ఖాళీలు లేవంటోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.చేయూతలో వాలంటీర్ల చేతివాటం

‘చేయూత’ పథకం లబ్ధిదారులు 70 మంది నుంచి వార్డు వాలంటీర్లు ముడుపులు వసూలు చేశారని గుంటూరు జిల్లా తెనాలి 33వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ మొగల్‌ రహమత్‌ బేగ్‌ ఆరోపించారు. గురువారం జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్కో లబ్ధిదారు నుంచి వాలంటీర్లు రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారంటూ, సంబంధిత వీడియోను ప్రదర్శించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.వైఎస్‌‘ఆర్టీసీ’!

అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా సిద్ధం సభకు బస్సులు కావాలంటే.. ఆర్టీసీ పూర్తి సొమ్ము కూడా అడక్కుండా 13 జిల్లాల నుంచి 3వేల బస్సుల్ని కేటాయించింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో త్వరలో జరిగే సభకు కూడా మొత్తం పది వేల బస్సులూ ఇచ్చేస్తాం, అవసరమైతే ఆర్టీసీకి సెలవులు ప్రకటించేందుకు ‘సిద్ధం’ అంటోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ‘జెండా’ సభకు 150 బస్సులు కావాలని, వాటికి ముందే సొమ్ము చెల్లిస్తామని చెప్పినా కూడా నో బస్‌! ప్రైవేటు వాహనాలు, పాఠశాల బస్సుల్నీ సిద్ధం సభకు తరలిస్తూ తరిస్తున్న రవాణా శాఖ.. ప్రతిపక్ష పార్టీల సభలకు వెళ్లే వాహనాలపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.జగనన్న వినడం లేదు..!

ముఖ్యమంత్రి జగన్‌ మాటలు ఘనం.. చేతలు శూన్యం అన్న రీతిలో పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నామని చెప్పడం మినహా ఆచరణలో కానరావడం లేదు. ఒక్క ఫోన్‌ కాల్‌తో ప్రజా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చంటూ శ్రీకారం చుట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. దీని అమలు ఎలా ఉందని ఇటీవల కాలంలో పెద్దగా సమీక్షించలేదు. పరిష్కారానికి అవసరమైన నిధులు ఇవ్వకుండా అధికారులపై పూర్తి భారాన్ని నెట్టేయడంతో వారు సతమతమవుతున్నారుపూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పేదల కాలనీల్లో.. పెద్దలు చేరారు!

వెలగలేరులో దారీ తెన్నూ లేని ప్రాంతంలో లేఔట్‌ వేశారు. అక్కడ  పేదలు ఇల్లు కట్టుకోలేక సతమతమవుతున్నారు. కొంతమంది స్థలాలను తక్కువ ధరకే విక్రయించుకుంటున్నారు. కొండపావులూరు, వెదురుపావులూరు లేఔట్లు దూరంగా ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.ఐటీ కారిడార్‌లను కలుపుతూ ఎంఎంటీఎస్‌లు

ఎట్టకేలకు ఎంఎంటీఎస్‌ రెండో దశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న ఐటీ కారిడార్‌లను కలుపుతూ లింగంపల్లి - ఘట్‌కేసర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ను బైపాస్‌ చేస్తూ లింగంపల్లి - సనత్‌నగర్‌ - మౌలాలి - చర్లపల్లి - ఘట్‌కేసర్‌ మార్గంలో ఈ రైళ్లు సాగనున్నాయి. మార్చి నాలుగైదు తేదీల్లో ఏదో ఒకరోజు ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. కాలుష్యం లేని, వేగవంతమైన ప్రజారవాణా నగర ప్రజలకు కేవలం రూ. 5ల టిక్కెట్‌ ధరతో దక్కనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.అంగరక్షకుల కోసం హత్యాయత్నం డ్రామా

అసలే రౌడీషీటర్‌.. పైగా సినీ నిర్మాత కూడా. ఇవి రెండు కాకుండా రాజకీయ నేత. ఇతడిపై ఒకటి కాదు, రెండు కాదు 7 కేసులున్నాయి. అంగ రక్షకులు ఉంటే సమాజంలో పలుకుబడి పెరుగుతుందని.. సినీ ఫక్కీలో తనపై తానే హత్యాయత్నం చేయించుకున్నాడు. ఏమీ తెలియనట్టుగా ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.పాడి కష్టం.. అమూల్‌ ‘పాలు’!

హకార డెయిరీలను పునరుద్ధరిస్తామని, వాటికి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హోరెత్తించిన జగన్‌.. ముఖ్యమంత్రి కాగానే మడమ తిప్పేశారు. అమూల్‌ను(జీసీఎంఎంఎఫ్‌- గుజరాత్‌ సహకార పాల పంపిణీ సమాఖ్య) అడ్డదారిలో రాష్ట్రంలోకి తెచ్చి.. పాడి రైతుల్ని ఉద్ధరిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అమూల్‌ రావడంతో.. లీటరుకు రూ.11 నుంచి రూ.22 చొప్పున అదనపు ధర లభిస్తోందని సీఎం జగన్‌ చెప్పేదంతా వట్టిమాటే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని