Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 Feb 2024 21:02 IST

1. వారం రోజుల్లో ఫ్రీ కరెంట్‌: సీఎం రేవంత్‌రెడ్డి

వారం రోజుల్లో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మార్చి 15న రైతు బంధు, రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటానని స్పష్టంచేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సింగరేణిలో 485 పోస్టులు.. గురువారం నోటిఫికేషన్‌: సీఎండీ

సింగరేణిలో 317 డైరెక్ట్‌, 168 ఇంటర్నల్‌ పోస్టులకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సీఎండీ తెలిపారు. కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమాపై గురువారం యూబీఐతో ఒప్పందం జరగనుందని వెల్లడించారు. సింగరేణి డైరెక్టర్లతో సమావేశమైన బలరామ్‌ వివిధ అంశాలపై చర్చించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లుగా వాలంటీర్లు కూర్చోవాలి!: మంత్రి ధర్మాన వ్యాఖ్యలు

ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లుగా వాలంటీర్లు కూర్చోవలసిన అవసరం ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వృద్ధులు, దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేయించడంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించాలని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి

చెట్టును కారు ఢీ కొనడంతో ఎస్సై సహా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నసాగర్‌ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్సై వెంకటరమణ(57), ఆయన అల్లుడు పవన్‌ సాయి (25), డ్రైవర్‌ చంద్ర (23)గా గుర్తించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పలు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల

పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) విడుదల చేసింది. వీటిల్లో మున్సిపల్‌ అడ్మినిష్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టుల ఫలితాలు ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జగజ్యోతికి 14 రోజుల రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు

కాంట్రాక్టరు నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు హాజరు పర్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాట్సప్‌ ప్రొఫైల్‌ ఫొటోలను ఇక స్క్రీన్‌ షాట్‌ తీయలేరు

యూజర్ల ప్రైవసీ పెంచడంలో భాగంగా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) కొత్త అప్‌డేట్‌తో వస్తోంది. అన్‌నోన్‌ కాల్‌ బ్లాకింగ్‌, చాట్‌లాక్‌ వంటి ఫీచర్లు తీసుకొచ్చిన వాట్సప్‌.. స్క్రీన్‌ షాట్‌ బ్లాక్‌ (screenshot block feature) సదుపాయాన్ని తీసుకురానుంది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లోక్‌సభ ఎన్నికల వేళ.. మార్చి 3న కేంద్ర మంత్రిమండలి భేటీ

సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) సంబంధించి మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. దిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో ఈ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. INDIA కూటమిలో అంతా ఓకే.. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది : అఖిలేశ్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలిసి పోటీ చేసే విషయంపై కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన ఊహాగాలను ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) తోసిపుచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందన్నారు. సీట్ల సర్దుబాటు కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇప్పుడు యుద్ధం ఆగినా.. 8 వేల మరణాలు..!

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం(Israel-Hamas conflict)తో గాజా(Gaza)లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యుల బతుకు ఛిద్రమవుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపినా.. రానున్న ఆరునెలల్లో సుమారు 8 వేల మంది మృతి చెందే అవకాశం ఉంది. ఈమేరకు అమెరికా, లండన్‌లకు చెందిన నిపుణులు రూపొందించిన నివేదిక పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని