Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Feb 2024 20:58 IST

1. ఓడిపోయినా.. ఆ నలుగురి ఘోషే వినిపిస్తోంది: రేవంత్‌రెడ్డి

తెలంగాణను భారాస అధినేత కేసీఆర్‌ దివాలా తీయించారని.. రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రజలకు ₹10 ఇచ్చి.. ₹100 దోచుకున్న దొంగ ప్రభుత్వం ఇది: చంద్రబాబు

వైకాపా పాలనలో అందరూ బాధితులేనని.. అందులో తానూ ఉన్నానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వంటి నాయకులపై ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌.. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు: షర్మిల

నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ న్యాయ సాధన సభ’కు  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాకంటే కష్టపడిన వాళ్లు ఉన్నారా? ఖమ్మం నుంచే పోటీ చేస్తా: వీహెచ్‌

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, అక్కడి ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేసినట్లు తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు

తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఫిబ్రవరి 23న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ కీ విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్‌ -2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ (APPSC Group 2 Key) విడుదలైంది. 897 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. క్రికెట్‌లో రాజకీయ నేత జోక్యం.. ఇక ఆంధ్రకు ఆడను: హనుమ విహారి

భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు ఆడబోనని హనుమ విహారి వెల్లడించాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని తెలిపాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్‌

పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ (50) ఎన్నికయ్యారు. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ (Nawaz Sharif) కుమార్తె అయిన  మరియం.. జనాభాపరంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్‌ ప్రావిన్సు సీఎంగా బాధ్యతలు చేపట్టడం విశేషం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో ఆయనకు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ పోటీ ఉండదా..? బరిలోకి డి.రాజా సతీమణి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మరోసారి కేరళలోని వయనాడ్(Wayanad) నుంచి పోటీలో ఉండకపోవచ్చని మీడియా కథనాలు వెల్లడించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని