Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Mar 2024 21:57 IST

1. సత్తెనపల్లిలో ప్రలోభాల పర్వం.. చీరలు స్వాధీనం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పారిశ్రామిక వాడలోని గోదాములో వైకాపా నేతలు నిల్వ ఉంచిన వేలాది చీరలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలు తీసుకొచ్చి సత్తెనపల్లిలోని గోదాములో నిల్వచేశారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగన్‌ బొమ్మ ముద్రించి ఉన్న బాక్సుల్లోని 5,472 చీరలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చెన్నై సౌత్‌ నుంచి తమిళి ‘సై’.. భాజపా మూడో జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు భాజపా అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. తమిళనాడుకు సంబంధించి తొమ్మిది స్థానాలకు కమలం పార్టీ (BJP) అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ (Tamilisai Soundarajan)ను చెన్నై సౌత్‌ సీటు నుంచి బరిలో దించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రధాని సభలో భద్రతా వైఫల్యం.. నివేదిక కోరిన ఈసీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్‌ మీనాను కోరింది. త్వరగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీ-విజిల్‌ ఫిర్యాదు బహిర్గతం.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్‌

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులకు సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఫిర్యాదును బహిర్గతం చేసిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ధరణి’లో అక్రమాలను ఆధారాలతో బయటపెడతాం: మంత్రి పొంగులేటి

ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత సర్కారు ధరణిని రహస్య డాక్యుమెంట్‌గా చూసిందని, తమ ప్రభుత్వం ఏదీ దాచి పెట్టదని స్పష్టం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీలో రాజకీయ హత్యలపై ఈసీ సీరియస్‌.. వివరణ ఇచ్చిన ఎస్పీలు

గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా వివరణ తీసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విశాఖ తీరంలో డ్రగ్స్‌ కలకలం.. కంటైనర్‌లో 25వేల కిలోల సీజ్‌

విశాఖ తీరంలో డ్రగ్స్‌ కలకలం రేగింది. బ్రెజిల్‌ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్‌ సమాచారంతో దిల్లీ సీబీఐ.. విశాఖలోని సీబీఐ, కస్టమ్స్‌ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్మార్ట్‌ డివైజ్‌తో మీ పనులు ఈజీ.. ఇక ఫోన్‌ అక్కర్లేదేమో!

కాల్స్‌ కోసం మన ఇళ్లల్లోకి వచ్చిన టెలిఫోన్‌.. ఇప్పుడు ప్రతి మనిషికీ తానే సర్వస్వం అనేలా మారిపోయింది. అది లేకుండా జీవితం గడవడం కష్టమనేలా అయిపోయింది. వెంట తీసుకెళ్లకపోతే ఏదో కోల్పోయామన్న భావన సైతం కొందరిలో వెంటాడుతుంటుంది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌ స్థానాన్ని తాను భర్తీ చేస్తానంటోంది ఈ బుల్లి డివైజ్.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల విస్తరణకు అదానీతో మహీంద్రా జట్టు

దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహన ఛార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పేందుకు అదానీ టోటల్‌ గ్యాస్‌ యూనిట్‌తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రకటించింది. ఈవీ ఛార్జింగ్‌ సేవల్ని విస్తృతం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పాటు అందిస్తుందని కంపెనీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఏప్రిల్‌ నుంచి కియా వాహనాల ధరల పెంపు

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. కారు ధరల్ని 3 శాతం వరకు పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని