Kia India: ఏప్రిల్‌ నుంచి కియా వాహనాల ధరల పెంపు

Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 21 Mar 2024 18:12 IST

Kia India | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. కారు ధరల్ని 3 శాతం వరకు పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

మెదడులో చిప్‌తో వీడియో గేమ్‌ ఆడిన పక్షవాత బాధితుడు

నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కియా ఇండియా నేషనల్‌ హెడ్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ హర్దీప్‌సింగ్‌ బ్రార్‌ తెలిపారు.     ఈ ఏడాదిలో కార్ల ధరల్ని పెంచడం ఇదే మొదటిసారి అని అన్నారు. కస్టమర్లకు ప్రీమియం, సాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను అందించడానికి కంపెనీ స్థిరంగా కృషి చేస్తుందని  పేర్కొన్నారు. కియా ఇండియా ప్రస్తుతం సెల్టోస్‌ (Seltos), సోనెట్‌ (Sonet), కేర్సెన్‌ (Carens) మోడల్ కార్లను విక్రయిస్తోంది. భారత్‌తో పాటు విదేశీ మార్కెట్లతో కియా ఇండియా ఇప్పటివరకు దాదాపు 1.16 మిలియన్‌ యూనిట్లను విక్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని