Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 Mar 2024 20:58 IST

1. హైదరాబాద్‌ మినహా భారాస అభ్యర్థులు ఖరారు

హైదరాబాద్‌ మినహా భారాస లోక్‌సభ అభ్యర్థులందరూ ఖరారయ్యారు. ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలకు మరో సారి అవకాశం ఇచ్చిన భారాస అధినేత కేసీఆర్‌.. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీకి కూడా పార్లమెంట్‌ టికెట్‌ ఇచ్చారు. గులాబీ టికెట్లు పొందిన వారిలో ఇద్దరు విశ్రాంత అఖిలభారత సర్వీసు అధికారులు ఉన్నారు. ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారింది: వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. కానీ ఇప్పుడు డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా వాటి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పోలవరం, పి.గన్నవరం అభ్యర్థులను ప్రకటించిన జనసేన

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన పార్టీ(Janasena)ఖరారు చేసింది. గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం, బాలరాజు పోలవరం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం.. ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న తెదేపా

విజయవాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన పార్టీ వర్క్‌షాప్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం రేపింది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని నేతలు పట్టుకున్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ పని చేస్తున్నారని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేను అలాంటి సీఎంను కాదు: రేవంత్‌రెడ్డి

గత భారాస ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. తాను సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తొలి మ్యాచ్‌లో ‘పంజా’బ్‌ విసిరింది.. దిల్లీపై సూపర్‌ విక్టరీ

ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ మెరిసింది. దిల్లీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించింది. దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లి ధరల్ని అదుపు చేయడానికి, తగిన నిల్వల్ని అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన ఆంక్షల గడువు మార్చి 31తో ముగియనుంది. ఈనేపథ్యంలో వీటి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్రం ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దిల్లీ హైకోర్టు తలుపుతట్టిన కేజ్రీవాల్‌

మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టు తలుపుతట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేశారు. ఆయన్ని ఈడీ కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సముద్ర జలాల్లో 90కి పైగా ఘటనలు.. 110 మందిని కాపాడాం : భారత నేవీ

ఇటీవల కాలంలో అరేబియా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాడులకు గురవుతున్న విదేశీ నౌకలకు భారత నేవీ (Indian Navy) అండగా నిలుస్తోంది. గత నవంబర్‌ నుంచి 90కిపైగా ఇలాంటి ఘటనలు జరిగాయని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌.హరికుమార్ వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మాస్కోలో మారణహోమం.. పుతిన్‌ హెచ్చరిక!

రష్యా (Russia) రాజధాని మాస్కోలోని (Moscow) అతిపెద్ద సంగీత కచేరీ హాలులో శుక్రవారం జరిగిన మారణకాండపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) స్పందించారు. ఈ ఘటనను అనాగరిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన ఆయన, దీనికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని