YS Sharmila: ఏపీ డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారింది: వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. కానీ ఇప్పుడు డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. 

Updated : 23 Mar 2024 17:55 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. కానీ ఇప్పుడు డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా వాటి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు.

‘‘డ్రగ్స్‌ రవాణా, వినియోగంలో ఏపీకి నంబర్‌ వన్‌ ముద్రవేశారు. విశాఖలో చిక్కిన డ్రగ్స్‌పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. నిఘా వ్యవస్థకు తెలియకుండా రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ ఎలా వస్తాయి? డ్రగ్స్‌ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ కేసులో తెర వెనుక ఎంతటి పెద్ద వాళ్లు ఉన్నా... నిగ్గుతేల్చాలని సీబీఐని కోరుతున్నా. ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్‌ డీల్‌గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు, పారదర్శక విచారణ కోసం సిటింగ్‌ జడ్జితో కమిటీ వేయాలి ’’ అని కేంద్రాన్ని షర్మిల డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు