Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 Mar 2024 20:59 IST

1. వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దు: ఈసీ

ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా

ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)ను (AP DSC Exam) షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ: చంద్రబాబు

ప్రజలు జగన్‌ బెండ్‌ తీయడం ఖాయమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టా.. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేని పాలన జగన్‌ది అని విమర్శించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గిడ్డంగుల్లో వైకాపా తాయిలాలు.. నలుగురిపై కేసు నమోదు

సార్వత్రిక ఎన్నికల వేళ తిరుపతి జిల్లా రేణిగుంటలో వైకాపా తాయిలాలు దొరికిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేశారు. గిడ్డంగి ఇన్‌ఛార్జ్‌, సెక్యూరిటీ గార్డు సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో వైకాపా నేతల పేర్లను మాత్రం పోలీసులు చేర్చలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్‌, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పెరిగిన డిమాండ్‌కు తగినట్టు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మహేశ్వర్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి సవాల్‌

మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ‘‘తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. పార్టీలో చేర్చుకోలేదని మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, గడ్కరీ వద్దకు వెళ్లి ఏదో చెప్పానని అంటున్నారు. మహేశ్వర్‌రెడ్డికి నేను సవాల్‌ చేస్తున్నా. వారిద్దరిని తీసుకొనిరా.. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం’’ అని ఛాలెంజ్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చిచ్చు రేపిన మూడు స్థానాలు.. ‘అఘాడీ’లో అంతర్గత పోరు

లోక్‌సభ ఎన్నికల ముంగిట మహారాష్ట్రలోని (Maharashtra) రాజకీయాలు మళ్లీ మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే శివసేన (Shiv sena), ఎన్సీపీలో (NCP) ఏర్పడిన చీలికలు కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీయగా.. తాజాగా కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్‌) వర్గాలతో ఏర్పడిన మహావికాస్‌ అఘాడీ కూటమిలోనూ అంతర్గత పోరు తీవ్రమవుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ట్రంప్‌ గెలవకూడదని ప్రపంచ నేతలు కోరారు: బైడెన్‌

ఈ ఏడాది చివర్లో జరిగే అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ల మధ్య గట్టి పోటీనే ఉంది. దీంతో ఇరువురు నేతలు ప్రచార జోరు పెంచారు. ఈక్రమంలోనే అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పౌరులను బందీలుగా మార్చిన సాయుధుడు.. నెదర్లాండ్స్‌లో కలకలం

నెదర్లాండ్స్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇడె(Ede) పట్టణంలోని పలువురు పౌరులు బందీలుగా మారారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ వ్యక్తి వారిని ఒక క్లబ్‌లో బంధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కలకలం సృష్టిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కుటుంబం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నా: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ఏప్రిల్ 5న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ తన కుటుంబాన్ని మంచి స్థాయిలో ఉంచేందుకు ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని