Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 31 Mar 2024 20:59 IST

1. హైదరాబాద్‌ To అయోధ్య.. డైరెక్ట్‌ విమానం

శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు డైరెక్ట్‌ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. విమాన సర్వీసు  ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్టు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పేదరికం లేని సమాజాన్ని చూడటమే నా జీవిత ఆశయం: చంద్రబాబు

పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవిత ఆశయమని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. జగన్‌ పాలనలో ప్రజల ఆదాయం తగ్గి.. ఖర్చులు విపరీతంగా పెరిగాయని దుయ్యబట్టారు. బాపట్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. తన మీద కేసులు పెట్టినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయి?: కేసీఆర్‌

కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భారాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమే: మోదీ

గత పదేళ్లలో ట్రైలర్‌ మాత్రమే చూశారని, అసలు అభివృద్ధి ముందుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. రానున్న ఐదేళ్లలో దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు భాజపా (BJP) రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల (LokSabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar Pradesh) మేరట్‌లో ప్రధాని పర్యటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భాజపాకు మమతా సవాల్‌.. కనీసం 200 స్థానాల్లో గెలవండి!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భాజపా చెబుతోన్న విషయం తెలిసిందే. వీటిపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కనీసం 200 నియోజకవర్గాల్లో గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి: పవన్‌

వైకాపా కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్‌ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. వర్మ త్యాగం గొప్పదన్న పవన్‌.. ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మెరిసిన మిల్లర్‌, సుదర్శన్‌.. హైదరాబాద్‌పై గుజరాత్‌ విజయం

ఐపీఎల్‌ 17 సీజన్‌లో గుజరాత్‌ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (36), వృద్ధిమాన్‌ సాహా (25) శుభారంభాన్నిచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్యాలెట్‌తో ఎన్నికలు జరగాలంటే.. అదొక్కటే మార్గం: దిగ్విజయ్‌ వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ సింగ్‌ ఈవీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకే సీటు నుంచి 400 మంది నామినేషన్లు వేస్తే.. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘నేను డమ్మీనా’ అంటూ విలేకరులపై మంత్రి బొత్స ఆగ్రహం

మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మీడియా సమావేశంలో అసహనం ప్రదర్శించారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా (YSRCP) ప్రాంతీయ సమన్వయకర్తల పేరిట స్థానికేతరులను తీసుకొచ్చి పెత్తనం అప్పజెప్పారు కదా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీంతో కోపంగా ‘నేను డమ్మీనా’ అని ప్రశ్నిస్తూ మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాక్ ఆర్థిక కష్టాలు.. రెడ్ కార్పెట్‌కు గుడ్‌బై

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్థాన్‌.. తమ ఆర్థిక అవసరాల కోసం అంతర్జాతీయ సంస్థలపై ఆధారపడుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు సూచించిన మార్గదర్శకాలను పాటించేందుకు ప్రయత్నిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని