Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 Apr 2024 21:01 IST

1.  ఓ దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు: చంద్రబాబు

ఏపీలో ప్రతి చోటా ‘వైకాపా ఓడిపోవాలి’ అనే నినాదమే వినిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో తుపాన్లు చూశామని మే 13న రాబోయే తుపానులో వైకాపా కొట్టుకుపోయి.. బంగాళాఖాతంలో కలిసిపోవాలని అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఓ దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 5 ఎంపీ స్థానాల్లో గెలిపించేందుకు మోదీతో కేసీఆర్‌ ఒప్పందం: రేవంత్‌

రాజకీయాల్లో పడిపోతున్న తనకు కేసీఆర్‌తో పోరాడేంత బలం ఇచ్చింది.. మాల్కాజిగిరి ప్రజలు, పార్టీ కార్యకర్తలేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‘జనజాతర’సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో భాజపాను గెలిపిస్తానని మోదీతో కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో అంతా మాఫియా మయమే: షర్మిల

సీఎం జగన్‌ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అలాంటి వారు అధికారంలో ఉంటే రాష్ట్ర భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందన్నారు. ఎక్కడ చూసినా మాఫియా మయమే అయ్యిందని విమర్శించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో షర్మిల మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మీకు రెండు ఇళ్లు ఉంటే ఒక దానిని కాంగ్రెస్‌ లాక్కుంటుంది: మోదీ

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రెండు ఇళ్లు ఉన్న వారి నుంచి ఒక ఇంటిని లాక్కుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘సంపద పునఃపంపిణీ’ ప్రకటనను ఉద్దేశిస్తూ  మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజ్యాంగాన్ని మార్చేందుకే.. ‘400 సీట్ల’ ప్రచారం : మోదీపై ఖర్గే విమర్శలు

ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైన మూడోవంతు మెజార్టీ లక్ష్యంగానే ఆ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు

తన మొత్తం ఆస్తుల విలువ రూ.5,700 కోట్లుగా ఉన్నట్లు గుంటూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్‌లో  పేర్కొన్నారు. ఆయనకు రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులుండగా.. భార్య శ్రీరత్న పేరిట రూ.2,280 కోట్ల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్‌’ ప్రదానం

భారత గణతంత్ర్య దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేసి గౌరవించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టీవీ అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీవీ అంపైర్‌ తీసుకున్న నిర్ణయంపై బెంగళూరు స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడికి ఐపీఎల్ నిర్వాహకులు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!

సికింద్రాబాద్‌: వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుపుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం - బెంగళూరు నగరాల మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 30 వరకు శని, ఆదివారాల్లో మాత్రమే ఈ రైళ్ల సర్వీసులు అందించనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిఘా వైఫల్యం ఎఫెక్ట్‌..! ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజీనామా

ప్రపంచంలో అత్యంత సమర్థమంతమైనవిగా గుర్తింపుపొందిన ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు.. హమాస్‌ కదలికలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. దీనిపై భద్రతా అధికారులు క్షమాపణలు సైతం చెప్పారు. ఈ క్రమంలోనే నాటి ఇంటెలిజెన్స్‌ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. ఇజ్రాయెల్‌ మిలటరీ నిఘా విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ అహరోన్‌ హలీవా రాజీనామా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని