icon icon icon
icon icon icon

Pemmasani Chandra sekhar: గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు

తన మొత్తం ఆస్తుల విలువ రూ.5,700 కోట్లుగా ఉన్నట్లు గుంటూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

Published : 22 Apr 2024 19:34 IST

అమరావతి: తన మొత్తం ఆస్తుల విలువ రూ.5,700 కోట్లుగా ఉన్నట్లు గుంటూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్‌లో  పేర్కొన్నారు. ఆయనకు రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులుండగా.. భార్య శ్రీరత్న పేరిట రూ.2,280 కోట్ల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయి.

వీటితోపాటు రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు, బ్యాంకు ఖాతాలో చెరో రూ.5.9 కోట్లు ఉన్నాయి. మొత్తం 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగుభూమి, హైదరాబాద్‌లో రూ.28.1 కోట్ల భూమి, రూ.29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, దిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.6.82 కోట్ల భూమి ఉన్నాయి. శ్రీరత్న పేరిట కృష్ణాజిల్లాలో రూ.2.33 కోట్ల విలువ చేసే సాగుభూమి. దిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.28.26 కోట్ల నివాస భవనాలు ఉన్నాయి.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తులు రూ.1,178.72 కోట్లు

మరోవైపు తెలంగాణలోని చేవెళ్ల భాజపా లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రూ.1,178.72 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆయన భార్య సంగీతారెడ్డి పేరిట రూ.3,203.9 కోట్ల ఆస్తులు ఉన్నాయి. విశ్వేశ్వర్‌రెడ్డి భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లు. అప్పులు మొత్తం రూ.1.76 కోట్లు. విశ్వేశ్వర్‌రెడ్డిపై 4 కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img