icon icon icon
icon icon icon

Loksabha polls: మీకు రెండు ఇళ్లు ఉంటే ఒక దానిని కాంగ్రెస్‌ లాక్కుంటుంది: మోదీ

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు ఇళ్లు ఉన్న వారి నుంచి ఒక ఇంటిని లాక్కుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘సంపద పునఃపంపిణీ’ ప్రకటనను ఉద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 22 Apr 2024 19:17 IST

లఖ్‌నవూ: ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రెండు ఇళ్లు ఉన్న వారి నుంచి ఒక ఇంటిని లాక్కుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘సంపద పునఃపంపిణీ’ ప్రకటనను ఉద్దేశిస్తూ  మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. 

‘‘కాంగ్రెస్ యువరాజు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని ఇళ్లు ఉన్నాయి అని విచారణ జరుపుతామన్నారు. మీకు పూర్వీకుల ఇల్లు ఉండి, మరో ఫ్లాట్ కూడా ఉంటే వాటిలో ఒకటి లాగేసుకుంటారు. ఇది మావోయిస్టు, కమ్యూనిస్టు భావజాలం. వాటినే కాంగ్రెస్ భారతదేశంలో అమలుచేయాలనుకుంటుంది. నేను దేశ ప్రజలను హెచ్చరిస్తున్నాను. ఇండియా కూటమి దృష్టి మీ సంపాదన, ఆస్తులపై పడింది.  కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, అమ్మానాన్నలకు, అక్కచెల్లెళ్లకు ఎంత బంగారం ఉందో విచారణ చేస్తామని కాంగ్రెస్‌ అంటోంది.’’ అని ప్రధాని మండిపడ్డారు. ఈ రాజవంశీయులు దేశ ప్రజలను దోచుకొని తమ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారని పరోక్షంగా సోనియాగాంధీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. ప్రజలను దోచుకోవడం వారి జన్మహక్కు అనుకుంటున్నారని మోదీ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img