Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Apr 2024 21:07 IST

1. హరీశ్‌రావు రాజీనామాపత్రం జేబులో పెట్టుకో: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘రైతు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావు రాజీనామా చేస్తామంటున్నారు. ఆగస్టు 15లోపు రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్‌రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలి. కేసీఆర్‌ మాదిరిగా హరీశ్‌రావు మాట తప్పవద్దు’’ అని సీఎం సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: చంద్రబాబు

జగన్‌ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌.. ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. అధికారంలో వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో తెదేపా, జనసేన నిర్వహించిన ఉమ్మడి ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌

ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణను నియమించింది. రేపు ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరో ఐదు చోట్ల అభ్యర్థుల మార్పు.. ఏపీలో కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మూడు లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ జాబితాను విడుదల చేశారు. ఈ నెల 22న విడుదల చేసిన జాబితాలో 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన కాంగ్రెస్‌.. తాజాగా మరో ఐదు చోట్ల (చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్‌, తెనాలి, కొండపి, మార్కాపురం) అభ్యర్థులను మార్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ ‘పది’ ఫలితాలు ఎప్పుడంటే..?

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు.. పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో TS SSC Resultsను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘కనీసం నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి’ - ఖర్గే భావోద్వేగం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. సొంత జిల్లా కలబురగిలో పర్యటించారు. ఈసందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టపడకున్నా.. ప్రజల కోసం పని చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్‌ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్‌ చిట్‌

లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.25 వేల కోట్ల విలువైన కోఆపరేటివ్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్‌ఐసీ అలర్ట్‌!

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ బుధవారం పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ఎల్‌ఐసీతో పాటు, సంస్థకు చెందిన వ్యక్తుల పేరుతో వివిధ సామజిక మాధ్యమ ఖాతాల్లో మోసపూరిత ప్రకటనలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి ప్రకటనలపై ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్‌ టిప్స్‌

ఉద్యోగానికి దరఖాస్తు చేసేటప్పుడు రెజ్యూమె విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వాటిలో అర్హతలు, నైపుణ్యాలతో ఆకర్షించేలా మన రెజ్యూమెను తయారుచేయడం చాలా ముఖ్యం అంటున్నారు ఫెయిర్‌ కాంప్ సీఈఓ, గూగుల్‌ మాజీ రిక్రూటర్‌ నోలన్‌ చర్చ్‌. అభ్యర్థులు రెజ్యూమెని రూపొందించడంలో చేయకూడని మూడు తప్పుల గురించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్‌

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షయానం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బట్చ్‌ విల్మోర్‌ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఒక వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండనున్నారు. ఈమేరకు నాసా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని