icon icon icon
icon icon icon

Congress: మరో ఐదు చోట్ల అభ్యర్థుల మార్పు.. ఏపీలో కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.

Published : 24 Apr 2024 20:43 IST

దిల్లీ: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మూడు లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ జాబితాను విడుదల చేశారు. ఈ నెల 22న విడుదల చేసిన జాబితాలో 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన కాంగ్రెస్‌.. తాజాగా మరో ఐదు చోట్ల (చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్‌, తెనాలి, కొండపి, మార్కాపురం) అభ్యర్థులను మార్చింది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్‌సభ సీటు సీపీఎంకు, గుంటూరు లోక్‌సభ స్థానం సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్‌.. చెరో ఎనిమిది అసెంబ్లీ సీట్లను వామపక్షాలకు కేటాయించిన విషయం తెలిసిందే.

లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..

  • నర్సాపురం - కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు (కేబీఆర్‌ నాయుడు)
  • రాజంపేట - షేక్‌ బషీద్‌
  • చిత్తూరు (ఎస్సీ)- ఎం.జగపతి

అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు వీరే..

  • చీపురుపల్లి -ఆదినారాయణ జమ్ము
  • శృంగవరపుకోట -గేదెల తిరుపతి
  • విజయవాడ తూర్పు - పొనుగుపాటి నాంచారయ్య
  • తెనాలి - చందు సాంబశివుడు
  • బాపట్ల -గంటా అంజిబాబు
  • సత్తెనపల్లి - చంద్ర పాల్‌ చుక్క
  • కొండపి (ఎస్సీ) - పసుమర్తి సుధాకర్‌
  • మార్కాపురం (సయ్యద్‌ సావేద్‌ అన్వర్‌
  • కర్నూలు - షేక్‌ జిలాని బాషా
  • ఎమ్మిగనూరు - మారుముళ్ల ఖాసీం వలీ
  • మంత్రాలయం - పీఎస్‌ మురళీకృష్ణరాజు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img