Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 May 2024 21:09 IST

1. ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్‌ కీలక నిర్ణయాలివే..

జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పగించారు. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకూ కొనాలని సీఎం ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నా కాల్‌ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు

పల్నాడులో జరిగిన అల్లర్లను తానే సృష్టించినట్లు వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలపై అన్ని కోణాల్లో విచారణ జరిపి నిగ్గు తేల్చాలన్నారు. అవసరమైతే తన కాల్‌ డేటాను పరిశీలించాలని.. విచారణకు తాను సిద్ధమని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం

ఏపీలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘బ్రాండ్‌ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

పదవులు, హోదా ఇలా గుర్తింపు సాధించేందుకు ఈ భూమ్మీదకు రాలేదని, ప్రజలకు తనవంతు సేవ చేసేందుకే తన జీవితం అంకితమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడారు. ఈసందర్భంగా ‘బ్రాండ్‌ మోదీ’ అంటూ తనపై వస్తున్న ప్రశంసలకు ఆసక్తికరంగా స్పందించారు. ప్రజా విశ్వాసమే తనకు ఆ పేరు పెట్టిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మళ్లీ వచ్చేది మోదీ సర్కార్‌.. పీవోకే విలీనం పక్కా: అమిత్‌ షా

సార్వత్రిక ఎన్నికల సమయంలో పీవోకే అంశాన్ని లేవనెత్తిన భాజపా.. ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. కచ్చితంగా పీవోకే మన దేశంలో విలీనం అవుతుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్‌!

లోక్‌సభ ఎన్నికల అయిదో దశ పోలింగ్‌ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మొత్తం 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. సాయంత్రం ఏడు గంటలకు దాదాపు 57.38 శాతం పోలింగ్‌ నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్‌ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్‌

మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ స్పందిస్తూ రోహిత్ చేసిన ఆరోపణలను ఓ ప్రకటనలో ఖండించింది. తాము రోహిత్‌ మాటలను రికార్డు చేయడం లేదా ప్రసారం చేయలేదని స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ (Uber) త్వరలో బస్సు సేవలను ప్రారంభించనుంది. దేశ రాజధాని నగరం దిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. దిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌ కింద ఇకపై బస్సులను నడపనుంది. బస్సు సర్వీసులకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్‌ చేసుకోవచ్చని ఉబర్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నెతన్యాహుపై అరెస్టు వారెంట్‌.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్‌

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధంపై అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కీలక అభ్యర్థనలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సహా హమాస్‌, ఇజ్రాయెల్‌ నేతలకు అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌

ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌ నియమితులయ్యారు. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని