Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 May 2024 21:00 IST

1. జూన్‌ 2న ట్యాంక్‌బండ్‌పై కార్నివాల్‌: సీఎస్‌ శాంతి కుమారి

రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జూన్‌ 2న ట్యాంక్‌బండ్‌పై కార్నివాల్‌ ఉంటుందని, స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భాస్కర్‌రెడ్డీ.. నీ అవినీతిని ఆధారాలతో బయటపెడతా: పులివర్తి నాని

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయడం వల్ల  వైకాపా ఆటలు సాగలేదని ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఆ అక్కసుతోనే తనపై దాడులు చేశారని ఆరోపించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు: ముకేశ్‌కుమార్‌ మీనా

పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్‌ నాటికి రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను రప్పిస్తున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. కౌంటింగ్ రోజు, ఆ తర్వాత కూడా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నన్ను క్షమించండి.. విచారణకు హాజరవుతా: ప్రజ్వల్‌ రేవణ్ణ

లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన.. కేసు విచారణకు సహకరిస్తానని, శుక్రవారం (మే 31న) ‘సిట్‌’ ముందు వ్యక్తిగతంగా హాజరవుతానంటూ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ ప్రధాని కావడం కష్టమే.. ఇది నా గ్యారంటీ: రాహుల్‌

కేంద్రంలోని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తనను తాను నిజమైన దేశభక్తుడిగా ప్రకటించుకుంటున్న ప్రధాని మోదీ.. అగ్నిపథ్‌ పథకంతో జవాన్లను అవమానించారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాహుల్‌ జీ.. రక్తపుటేర్లు కాదు.. గులకరాయి విసిరే ధైర్యం కూడా ఎవరికీ లేదు: అమిత్ షా

‘‘జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని మోదీ రద్దు చేశారు. ఈ ఆర్టికల్‌ను తొలగిస్తే అక్కడ రక్తపుటేర్లు పారతాయని రాహుల్‌ గాంధీ అప్పట్లో అన్నారు. రాహుల్‌ జీ.. ఇది భాజపా ప్రభుత్వం.. రక్తపుటేరులు మరిచిపోండి.. గులకరాయి విసిరే ధైర్యం కూడా ఎవరికీ లేదు’’ అని కేంద్రమంత్రి అమిత్‌షా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మ్యానిఫెస్టోలో వాగ్దానాలను ‘అవినీతి’గా పరిగణించలేం - సుప్రీంకోర్టు

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని, అంతేకాకుండా పార్టీ అభ్యర్థి కూడా అవినీతి చేయడంతో సమానమని పిటిషనర్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘నాలుగేళ్లుగా నిద్రపోయారా? మీపై నమ్మకం లేదు’ - గుజరాత్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వీడియో గేమ్‌జోన్‌ అగ్ని ప్రమాద ఘటనలో 28 మంది ఆహుతైన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. ఈ నేపథ్యంలో స్థానిక మునిసిపల్‌ అధికారుల తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర యంత్రాంగంపై తమకు విశ్వాసం లేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫైనల్లో ఓటమి.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లను ఓదార్చిన కావ్య మారన్‌

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతాతో జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. దీంతో ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. సీజన్‌ ఆద్యంతం జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిందని, అందువల్లే కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచినా మన (సన్‌రైజర్స్‌) గురించే మాట్లాడుకుంటున్నారని కావ్య మారన్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎల్‌ఐసీ లాభం రూ.13,763 కోట్లు.. ఒక్కో షేరుపై ₹6 డివిడెండ్‌

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ రూ.13,763 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎల్‌ఐసీ 40,676 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. తుది డివిడెండ్‌ కింద ఒక్కో షేరుకు రూ.6 చొప్పున ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని