Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 11 Jun 2024 20:59 IST

1. రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. జగన్‌కు చంద్రబాబు ఫోన్‌ .. అందుబాటులోకి రాని వైకాపా అధినేత

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి తెదేపా అధినేత చంద్రబాబు మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ఆయన జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి స్వయంగా ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. కానీ, జగన్‌ అందుబాటులోకి రాలేదని సమాచారం. 

3. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 15 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు ఎనిమిది రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు. 11 రైళ్లను దారి మళ్లించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లోక్‌సభ ఎన్నికల్లో విజయం.. రాజ్యసభలో 10 స్థానాలు ఖాళీ

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించడంతో.. ఆ సభలో 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజ్యసభ సెక్రటేరియట్‌ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది. 18వ లోక్‌సభకు ఎన్నికైన నేపథ్యంలో జూన్‌ 4 నుంచి వారి రాజ్యసభ సభ్యత్వం నిలిచిపోయినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ

ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్‌ మాఝీని పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు అలాగే, కనక్‌ వర్ధన్‌ సింగ్‌ డియో, ప్రవటి పరిదాలకు ఉప ముఖ్యమంత్రులుగా పదవులు దక్కాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 3.Oలో మోదీ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే..?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ వారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో (G7 summit) పాల్గొననున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రియాంక పోటీ చేస్తే.. మోదీ ఓడిపోయేవారు: రాహుల్‌ గాంధీ

ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేసి ఉంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓడిపోయేవారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కనీసం రెండు, మూడు లక్షల ఓట్ల తేడాతో తన సోదరి చేతిలో పరాజయం పాలయ్యేవారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హెచ్‌ఎండీ బ్రాండ్‌పై ఫీచర్‌ ఫోన్లు.. యూపీఐ సదుపాయంతో 105, 110 మోడళ్లు

నోకియా బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేస్తున్న హెచ్‌ఎండీ (HMD) సంస్థ తన సొంత బ్రాండ్‌పై రెండు ఫీచర్‌ ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్‌ చేసింది. హెఎండీ 110, హెచ్‌ఎండీ 105 పేరిట వీటిని తీసుకొచ్చింది. ఈ బ్రాండ్‌పై తీసుకొచ్చిన తొలి ఫోన్లు ఇవే కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌పై వ్లాగ్‌.. యూట్యూబర్ హత్య

ఇండియా(India) పాకిస్తాన్(Pakistan) మ్యాచ్‌ అంటే ఇరుదేశాలలోనూ అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. పాకిస్థానీ మీడియా ప్రకారం... ఇండియా, పాకిస్థాన్‌కు క్రికెట్‌ మ్యాచ్‌ కాసేపట్లో జరగనుండగా మ్యాచ్‌పై వ్లాగ్‌ చేస్తున్న ఓ పాకిస్థానీ యూట్యూబర్‌(YouTuber) సెక్యూరిటీ గార్డ్‌ చేతిలో హతమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.  విమానం అదృశ్యం కథ విషాదాంతం.. మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం

ఆఫ్రికా దేశమైన మలావీలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అది పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా వెల్లడించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని.. అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని