Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Mar 2024 13:16 IST

1. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు నక్సల్స్‌ హతం

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. బీజాపుర్‌ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చికుర్‌బత్తి- పుస్బాక అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ దాగి ఉన్నట్లు సమాచారం రావడంతో.. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌ బలగాలు సంయుక్తంగా యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. పూర్తి కథనం

2. ఆ కంటెయినర్‌లో ఏముంది?బ్రెజిల్‌ సరకా.. మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా?: నారా లోకేశ్‌

రోజూ తన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్‌ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్‌ సంగతేంటి? ఎందుకు దాన్ని తనిఖీ చేయలేదు. అందులో ఏముంది? బ్రెజిల్‌ సరకా?’’పూర్తి కథనం

3. అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!

అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన వంతెన ప్రమాదంలో (Baltimore bridge collapse) గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్‌ రవాణాశాఖ కార్యదర్శి పాల్‌ వైడెఫెల్డ్ తెలిపారు.పూర్తి కథనం

4. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్‌ దంపతులు

తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నేడు చెర్రీ పుట్టినరోజు కావడంతో దర్శనానికి వచ్చారు. అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూర్తి కథనం

5. హుక్కా బార్‌లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్‌ ఫరూఖీ

స్టాండప్‌ కమెడియన్‌, బిగ్‌బాస్‌ విన్నర్ మునావర్ ఫరూఖీ (Munawar Faruqui) మరోసారి వివాదాల్లో నిలిచాడు. ముంబయిలోని హుక్కా బార్‌లో జరిగిన సోదాల అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఫోర్ట్ ఏరియాలో చట్టవిరుద్ధంగా నడుపుతోన్న హుక్కా పార్లర్‌లో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.పూర్తి కథనం

6. 256 ఏళ్ల బ్రిటిష్‌ మ్యూజియం చరిత్రకు మచ్చ.. 1,800 పురాతన వస్తువుల చోరీ!

ప్రఖ్యాత బ్రిటిష్‌ మ్యూజియంలో (British Museum) దాదాపు 1,800 పురాతన వస్తువులు చోరీకి గురైనట్లు దాని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. సంరక్షణాధికారి పీటర్‌ హిగ్స్‌ వాటిని అపహరించి ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు ఆరోపించారు. అతణ్ని 2023 జులైలోనే విధుల్లో నుంచి తొలగించారు.పూర్తి కథనం

7. సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చల వేళ.. ఉద్ధవ్‌ పార్టీ తొలి జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) దగ్గరపడుతున్న వేళ బరిలోకి దిగే గెలుపు గుర్రాల ఎంపికలో పార్టీలన్నీ తలమునకలయ్యాయి. మహారాష్ట్ర (Maharashtra) మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం తొలి జాబితాను విడుదల చేసింది.పూర్తి కథనం

8. వీహెచ్‌కు బుజ్జగింపులు.. అండగా ఉంటానని సీఎం రేవంత్‌ భరోసా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు (వీహెచ్‌) సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. తనకు దక్కే అవకాశం లేదని సమాచారం అందడంతో అలకబూనారు. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి కథనం

9.‘ఎక్స్‌’ ప్రీమియంలో కొత్త ఫీచర్‌.. ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’కు యాక్సెస్‌

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు (Elon Musk) చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మరో కొత్త ఫీచర్‌ రానుంది. కృత్రిమ మేధ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ (Grok)ను వచ్చేవారం నుంచి ప్రీమియం చందాదారులందరికీ అందించనున్నట్లు మస్క్‌ మంగళవారం వెల్లడించారు.పూర్తి కథనం

10. ‘మీ వల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి’: నౌకలోని భారత సిబ్బందికి బెడైన్‌ ప్రశంసలు

నౌక ఢీకొనడంతో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్ (Biden) స్పందించారు. సహాయక సిబ్బంది, నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని