Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 28 May 2024 13:09 IST

1. ఆ గాలి మాటలను పట్టించుకోను: ప్రధానిమోదీ

గత 24 సంవత్సరాలుగా తనపై వస్తోన్న దుర్భాషలు వింటూనే ఉన్నానని.. చివరకు ఆ గాలి మాటలను పట్టించుకోవడం లేదని ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) అన్నారు. ఇప్పటివరకు 101 సార్లు విపక్షాలు తనను దుర్భాషలాడాయని పార్లమెంట్ సభ్యుడొకరు లెక్కించి చెప్పారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గ్రానైట్‌ క్వారీ కూలి పది మంది మృతి

మిజోరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐజ్వాల్‌ జిల్లాలో గ్రానైట్‌ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైకోర్టులో డేరా బాబాకు ఊరట..

డేరా సచ్చా సౌదా చీఫ్‌, వివాదాస్పద మతగురువు గుర్మింత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు పంజాబ్‌-హరియాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓ హత్య కేసులో మంగళవారం అతడిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్‌ సురేష్‌వార్‌ ఠాకూర్‌, జస్టిస్‌ లలిత్‌ బత్రాతో కూడిన డివిజన్‌ బెంచ్‌ డేరా బాబా అప్పీల్‌ను పరిశీలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకుల గల్లంతు

విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గోస్తనీ నది చెక్‌డ్యామ్‌కు మంగళవారం ఉదయం ఈత కోసం ఆరుగురు యువకులు వచ్చారు. మొదట ఒకరు మునిగి పోవడంతో రక్షించడానికి ఒకరి తర్వాత మరొకరు నీటిలోకి దిగారు. ఇలా ముగ్గురు గల్లంతు కాగా.. మిగతావారు ఒడ్డుకు చేరుకుని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవాలను ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ ఉత్సవాల్లో రాష్ట్ర అధికార గీతం, చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పది సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థుల అనాసక్తి..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులు భారీగా గైర్హాజరు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన రెగ్యులర్  పరీక్షల్లో ఉమ్మడి జిల్లాలో 20 వేల మంది విద్యార్థులు తప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ శైలి అజరామరం: పవన్‌ కల్యాణ్‌

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎన్టీఆర్‌ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారు

తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాకు ఆ వ్యాధి ఉన్నట్లు ఇటీవలే తెలిసింది: ఫహాద్‌ ఫాజిల్‌

 ‘పుష్ప’తో అన్ని భాషల వారికి చేరువయ్యారు మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా తన ఆరోగ్యం గురించి ఓ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. 41 ఏళ్ల వయసులో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD) వ్యాధి నిర్ధరణ అయినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వాతావరణ మార్పులతో ఆరోగ్యంపై ప్రభావం

ఆరోగ్య పరిరక్షణలో తినే తిండి, చేసే వ్యాయామం, జీవనశైలి ఎంత ముఖ్యమో వాతావరణంది కూడా అంతే కీలక భూమిక. సీజన్ మారినపుడల్లా ఆరోగ్యంపై ప్రభావం పడడం సహజం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని