TS CPGET: తెలంగాణలో సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌-2022) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి..

Updated : 06 Jun 2022 17:48 IST

హైదరాబాద్: తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌-2022) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి జులై 4వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని లింబాద్రి వెల్లడించారు. ఆలస్య రుసుం రూ.500తో జులై 11వ తేదీ వరకు, రూ.2వేలు ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని లింబాద్రి తెలిపారు. జులై 20 నుంచి సీపీగెట్ పరీక్షలు జరగనున్నాయి.

ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్‌తో పాటు ఈ ఏడాది కొత్తగా రానున్న మహిళా యూనివర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ 8 విశ్వవిద్యాలయాల పరిధిలోని 320 కళాశాలల్లోని 50 కోర్సుల్లో 44,604 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ సబ్జెక్టులో డిగ్రీ చదివిన వారైనా.. సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ కోర్సుల్లో పీజీ చేసేలా ఈ ఏడాది నిబంధనలు సవరించినట్లు లింబాద్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని