Andhra News: ఉత్తరాంధ్రకు వాయు‘గండం’.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ 

Updated : 07 Aug 2022 18:12 IST

అమరావతి: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఇది వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌ మీదుగా క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తారంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని