American Airlines: విమానంలో మరోసారి మూత్రవిసర్జన ఘటన
American Airlines: విమానంలో మరోసారి ఓ ప్రయాణికుడు తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దిల్లీ: ఎయిరిండియా (Air India) మూత్రవిసర్జన వివాదం ఇంకా మరువక ముందే అదే తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి దిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines)లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చుకున్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. AA292 నంబర్‌తో ఉన్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ విమానం శుక్రవారం న్యూయార్క్ నుంచి రాత్రి 9:16 గంటలకు బయలుదేరింది. దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది.
నిందితుడు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి. తమకు అందిన ఫిర్యాదు ప్రకారం.. మూత్రం పోసిన సమయంలో అతడు తాగిన మైకంతో నిద్రిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ విమానాశ్రయ అధికారి తెలిపారు. ఆ మూత్రం పక్కనే ఉన్న తనపై పడ్డట్లు తోటి ప్రయాణికుడు వెంటనే విమాన సిబ్బందికి తెలియజేశాడు. అయితే, బాధితుడు మాత్రం దీన్ని పోలీసుల వరకు తీసుకెళ్లాలని భావించలేదని సమాచారం. నిందితుడు క్షమాపణలు చెప్పడంతో పాటు ఇది వివాదంగా మారితే తన కెరీర్‌కే ముప్పని ప్రాధేపడ్డట్లు తెలుస్తోంది. కానీ, విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని వెంటనే పైలట్ ద్వారా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)’ దృష్టికి తీసుకెళ్లారు.
ఏటీసీ అధికారులు సీఐఎస్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ కాగానే నిందితుణ్ని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకొని దిల్లీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరుపక్షాల వాదనలు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ఏ ప్రయాణికుడైనా దురుసుగా ప్రవర్తించినట్లు తేలితే క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అలాగే నిర్ణీత సమయం పాటు విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తారు.
2022 నవంబరు 26న కూడా ఇదే తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి ఓ పెద్దావిడపై మూత్ర విసర్జన చేశాడు. అయితే, ఆ విషయం దాదాపు నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. తర్వాత నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. దాదాపు నెలరోజులు జైల్లో గడిపిన అతడు ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చాడు. నాలుగు నెలల పాటు విమానాల్లో ప్రయాణించకుండా అతడిపై నిషేధం విధించారు. మరోవైపు ఘటన జరిగిన 12 గంటల్లోగా ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురానందుకు ఎయిరిండియాపై డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది.
స్టూడెంట్ భవిష్యత్ ప్రయాణాలపై నిషేధం..
మూత్ర విసర్జన చేసిన భారత స్టూడెంట్‌ను భవిష్యత్‌లో తమ విమానాల్లో అనుమతించబోమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. మూత్రవిసర్జనే కాకుండా అంతకుముందు అతడు సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగినట్లు పేర్కొంది. సిబ్బంది ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా తోటి ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. మరోవైపు సదరు వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు దిల్లీ పోలీసులు సైతం ధ్రువీకరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే