Maharashtra: జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్‌ఆర్‌సీ ఆదేశం

విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.

Published : 26 Apr 2024 00:09 IST

ముంబయి: విచారణ ఖైదీల పట్ల జైలు అధికారుల నిర్లక్ష్యంపై మహారాష్ట్ర (Maharashtra) మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. ఓ కేసులో దోషిగా ఉన్న వ్యక్తికి రూ.2లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఖైదీగా ఆ వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కులను జైలు అధికారులు ఉల్లంఘించారని పేర్కొంది. దీంతో సదరు ఖైదీకి రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.

మావోయిస్టులకు నిధులు సమకూర్చడం, ఎల్గర్-పరిషత్ కేసులో మావోయిస్టులతో సంబంధం ఉందన్న ఆరోపణలపై అరుణ్‌ ఫెరీరా దోషిగా తేలారు. కొన్నేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఆయన.. తన తండ్రి విషయంలో తల్లికి లేఖ రాయగా.. దీన్ని అధికారులు ఆమెకు చేరవేయలేదు. దీంతో ఆయన ఎంహెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు.

కేంద్రమంత్రి ఆడియో క్లిప్‌ లీక్‌ చేయమన్నారు: రాజస్థాన్‌ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు

దీనిపై కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. అధికారుల తీరుపై మండిపడింది. ఇది ప్రాథమిక హక్కును ఉల్లంఘించమే అవుతుందన్న కమిషన్‌.. నిబంధనల ప్రకారం ఫెరీరాకు పరిహారంగా రూ.2 లక్షలు చెల్లించాలని హోంశాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం చెల్లించడమే కాక.. ఖైదీలు రాసిన లేఖల సెన్సార్‌షిప్‌కు సంబంధించి జైలు నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు