Army: ఎనిమిదేళ్లు మృత్యువుతో పోరాడి.. అలసిపోయిన యోధుడు

దేశంపై ప్రేమతో.. సైనిక దళాలపై మమకారంతో ఆర్మీలో కెరీర్‌ ముగిసినా.. టెరిటోరియల్‌ దళంలో చేరిన ఓ అధికారి అమరుడయ్యారు. ఓ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆయన దాదాపు ఎనిమిదేళ్లు మృత్యువుతో పోరాడారు.  

Published : 26 Dec 2023 16:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ ఉగ్ర ఆపరేషన్‌లో వీరోచితంగా గాయపడి కోమాలోకి చేరుకొన్న సైనికాధికారి ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘంగా మృత్యువుతో పోరాడి అలసిపోయారు. టెరిటోరియల్‌ ఆర్మీ విభాగానికి చెందిన లెఫ్టినెంట్‌ కర్నల్‌ కరణ్‌బీర్‌ సింగ్‌ నాట్‌ డిసెంబర్‌ 24న పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆర్మీఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన సేనా మెడల్‌ గ్రహీత కూడా. ఆయన 160 ఇన్‌ఫెంట్రీ బెటాలియన్‌లో సెకండ్‌ ఇన్‌ కమాండ్‌గా పనిచేశారు.  ‘టెరిటోరియల్‌ ఆర్మీ’లో చేరక ముందు పద్నాలుగేళ్లు సైన్యంలో పనిచేశారు. ఆ తర్వాత ఆర్మీ నుంచి బయటకు వచ్చినా.. జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌లోని టెరిటోరియల్‌ ఆర్మీ విభాగంలో చేరారు.  

మానవ మెదడును అనుకరించొచ్చు!

2015 నవంబర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ కశ్మీర్‌లోని కుప్వార జిల్లాలోని కాలారూస్‌లో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ప్రాంతంలో అప్పటికే వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన కర్నల్‌ సంతోష్‌ మహదిక్‌ ఉగ్రకాల్పుల్లో మరణించారు. అదే ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన సమయంలో సింగ్‌ తలకు తూటా తాకింది. కానీ, ముగ్గురి ప్రాణాలను  కాపాడారు. గాయపడిన అతనిని హెలికాప్టర్‌లో దిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన్ను కాపాడేందుకు పలు శస్త్రచికిత్సలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని