అప్రమత్తంగా ఉండాలి

ఉత్తర చైనాలో ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో శ్వాసకోశ సంబంధ సమస్యలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా ఈ సమస్యను గమనించి తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తూ అడ్వయిజరీ జారీ చేసింది.

Published : 27 Nov 2023 04:04 IST

చైనాలో శ్వాసకోశ సమస్యపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

ఈనాడు, దిల్లీ: ఉత్తర చైనాలో ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో శ్వాసకోశ సంబంధ సమస్యలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా ఈ సమస్యను గమనించి తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తూ అడ్వయిజరీ జారీ చేసింది. ఇప్పటికే దేశంలో ఇన్‌ఫ్లూయెంజా విస్తరిస్తోందని, దానికి శీతాకాలం తోడైతే సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రజారోగ్య పరిస్థితులను వెంటనే సమీక్షించి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని నిర్దేశించింది. ‘మానవ వనరులు, పడకలు, మందులు, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్లు, మెడికల్‌ ఆక్సిజన్‌, యాంటీ బయాటిక్స్‌, టెస్టింగ్‌ కిట్లు, రీజెంట్స్‌ సమకూర్చుకోవాలి. ఆక్సిజన్‌ ప్లాంట్లు, వెంటిలేటర్లు పనిచేసేలా చూసుకోవాలి’ అని లేఖలో కేంద్రం సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని