నీట్‌ పేపర్‌ లీక్‌ అవాస్తవం

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్‌ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్‌టీఏ కొట్టిపారేసింది.

Published : 07 May 2024 04:17 IST

 మరోసారి స్పష్టంచేసిన ఎన్‌టీఏ

దిల్లీ, పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్‌ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్‌టీఏ కొట్టిపారేసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన ఫొటోలకు అసలు ప్రశ్నపత్రానికి పోలికే లేదంటూ మరోసారి స్పష్టంచేసింది. ప్రతి ఒక్క ప్రశ్నపత్రానికి తమ వద్ద లెక్క ఉందని తెలిపింది. మాల్‌ప్రాక్టీస్‌ చేశారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా దాదాపు 50 మంది అరెస్టయినట్లు ఎన్‌టీఏ డైరెక్టర్‌ సాధన పరాశర్‌ సోమవారం పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంలో ఒక్క పట్నాలోనే 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఏడుగురు అసలు విద్యార్థులకు బదులు పరీక్షకు హాజరయ్యారని, మరికొందరు పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు ఇచ్చిన వారని తెలిపారు. ఓ పేపర్‌ లీక్‌ బృందం కొంతమంది విద్యార్థుల నుంచి రూ.20 లక్షలు తీసుకుని పట్నాలోని లాడ్జిల్లో వారిని పరీక్షకు సిద్ధం చేసిందని తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. ఈ దిశగా దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని