Covid: ‘బీటా’పై ప్రస్తుతటీకాల సమర్థత తక్కువే
: కరోనా వైరస్‌లో కొత్తగా వెలుగుచూసిన బీటా రకంపై ప్రస్తుత టీకాలు సమర్థంగా పనిచేయకపోవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. సదరు వేరియంట్‌లోని స్పైక్ ప్రొటీన్‌పై పరిశోధన జరిపినప్పుడు ఈ విషయం వెల్లడైంది. ఈ ప్రొటీన్ సాయంతోనే కరోనా.. మానవ కణంలోకి ప్రవేశిస్తోంది.
అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి
బోస్టన్: కరోనా వైరస్‌లో కొత్తగా వెలుగుచూసిన బీటా రకంపై ప్రస్తుత టీకాలు సమర్థంగా పనిచేయకపోవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. సదరు వేరియంట్‌లోని స్పైక్ ప్రొటీన్‌పై పరిశోధన జరిపినప్పుడు ఈ విషయం వెల్లడైంది. ఈ ప్రొటీన్ సాయంతోనే కరోనా.. మానవ కణంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుత టీకాలన్నీ దీని లక్ష్యంగా తయారైనవే. అమెరికాలోని బోస్టన్ పిల్లల ఆసుపత్రికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధన చేశారు. వీరు క్రిప్టో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. బీటా, ఆల్ఫా వేరియంట్లను 2019లో మొదట వుహాన్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్‌తో పోల్చి చూశారు. బీటా రకం వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌లో కొన్ని చోట్ల ఆకృతి మారినట్లు వెల్లడైంది. ఫలితంగా.. ప్రస్తుత టీకాల కారణంగా వెలువడే యాంటీబాడీలకు ఈ వేరియంట్‌ను బంధించే సామర్థ్యం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ నేపథ్యంలో బీటా రకం నుంచి రక్షణ పొందడానికి బూస్టర్ టీకా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అయితే బీటాలోని స్పైక్ ప్రొటీన్లు.. మానవ కణంలోని ఏసీఈ-2 గ్రాహకంతో సమర్థంగా బంధాన్ని ఏర్పర్చలేకపోతున్నాయని వివరించారు. అందువల్ల అది ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే అంత ఉద్ధృతంగా వ్యాప్తి చెందడంలేదన్నారు. ఆల్ఫా వైరస్ స్పైక్ ప్రొటీన్‌లోని జన్యుమార్పు వల్ల అది ఏసీఈ-2 గ్రాహకంతో మెరుగ్గా బంధాన్ని ఏర్పరుస్తోందని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gold Sezed: నెల్లూరు, హైదరాబాద్‌లో 10.27 కిలోల బంగారం పట్టివేత
-
Politics News
Ajit Pawar: అజిత్ మళ్లీ పక్కకే.. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే
-
General News
Hyderabad: గీత కార్మికులకు రూ.12.50లక్షల ఎక్స్‌గ్రేషియా విడుదల: మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
General News
Fire Accident: ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం
-
Sports News
WTC Final: క్లిష్టసమయంలో కీలక ఇన్నింగ్స్.. రహానె ప్రత్యేకత అదే: సునీల్ గావస్కర్
-
Politics News
Maharashtra: షిందే-భాజపా సర్కార్‌లో అంతర్గత పోరు?