
ప్రముఖ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్‌పై ఫిర్యాదు
ముంబయి: ప్రముఖ మరాఠీ, బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఈ నెల 14న విడుదలైన మరాఠీ చిత్రం ‘నయ్ వరన్ భట్ లోంచా కొన్ నయ్ కోంచా’ వివాదంలో చిక్కుకుంది. అందులో మహిళలు, చిన్నారులను శృంగార సన్నివేశాల్లో అభ్యంతరకర రీతిలో చూపారంటూ క్షత్రియ మరాఠా సేవా సంస్థ కోర్టుకు ఫిర్యాదు చేసంది. మహేశ్ మంజ్రేకర్‌తోపాటు ఆ చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలంటూ అందులో కోరింది. దీనిపై ఫిబ్రవరి 28న విచారణ జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.