ఉదయ్‌పుర్‌ ఘటనపై హిందూసంస్థల నిరసనలు

విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ వంటి హిందూ సంస్థలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన దర్జీ కన్హయ్యలాల్‌ దారుణహత్యకు నిరసనగా దేశంలో పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నాయి. ఈ ఆందోళనల...

Published : 03 Jul 2022 06:32 IST

గురుగ్రాం (హరియాణా): విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ వంటి హిందూ సంస్థలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన దర్జీ కన్హయ్యలాల్‌ దారుణహత్యకు నిరసనగా దేశంలో పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నాయి. ఈ ఆందోళనల సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారన్న అభియోగంపై నలుగురు నేతలకు సెక్షన్‌ 41 కింద హరియాణా పోలీసులు నోటీసులు జారీచేసి, శనివారం తమ ఎదుట హాజరుకావలసిందిగా కోరారు. ఈ నోటీసులను వారు బేఖాతరు చేయడం గమనార్హం. వీరికి సోమవారం రెండోవిడత నోటీసులు జారీ చేయనున్నట్లు గురుగ్రాం పోలీసులు తెలిపారు. మితవాదులు ఇచ్చిన పిలుపు మేరకు.. శనివారం హరియాణా రాష్ట్ర బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. మానేసర్‌లోని భీష్మ్‌దాస్‌ ఆశ్రమంలో ఆదివారం ఉదయం పదింటికి ‘జిహాదీ భావజాల వ్యతిరేక సదస్సు’ను పై సంస్థలు ఏర్పాటు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని