నాలుగో విడత ‘సీయూఈటీ-యూజీ’ పరీక్ష వాయిదా

దేశంలో నాలుగో విడతగా 11 వేల మంది విద్యార్థులు రాసే కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ)ని ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. వారి ఐచ్ఛికాలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను (నగరాలను) ఎంపిక చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Published : 14 Aug 2022 05:53 IST

దిల్లీ: దేశంలో నాలుగో విడతగా 11 వేల మంది విద్యార్థులు రాసే కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ)ని ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. వారి ఐచ్ఛికాలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను (నగరాలను) ఎంపిక చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ పరీక్షలను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. ఈమేరకు పరీక్షా కేంద్రాలను పెంచినట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. రెండో దశలో నిర్వహించిన పరీక్షలో పలు సమస్యలు ఎదురు కావడంతో అనేక కేంద్రాల్లో ఎన్‌టీఏ పరీక్షను రద్దు చేసింది. అలాంటివారంతా ఆగస్టు 30న పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని