ఆస్ట్రేలియాలో హత్య చేసి.. భారత్‌లో చిక్కి

నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఓ యువతిని హత్య చేసి భారత్‌లో తలదాచుకుంటున్న నిందితుడిని దిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Published : 26 Nov 2022 05:02 IST

నాలుగేళ్ల తర్వాత అరెస్టైన నిందితుడు

దిల్లీ: నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఓ యువతిని హత్య చేసి భారత్‌లో తలదాచుకుంటున్న నిందితుడిని దిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ నర్సుగా పనిచేస్తున్న రాజ్‌విందర్‌ సింగ్‌ (38).. 2018లో క్వీన్స్‌లాండ్‌ బీచ్‌లో తొయా కార్డింగ్లే అనే యువతి(24)ని హత్య చేశాడు. అనంతరం తన ఉద్యోగాన్ని, భార్య, ముగ్గురు పిల్లలను వదిలేసి ఆస్ట్రేలియా నుంచి పారిపోయాడు. దీంతో క్వీన్స్‌లాండ్‌ పోలీసులు.. రాజ్‌విందర్‌ ఆచూకీ తెలిపిన వారికి మిలియన్‌ డాలర్లు (8.17 కోట్లు) బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. 2021లో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా నిందితుడిని అప్పగించాలని భారత్‌ను కోరింది. ఈ విజ్ఞప్తికి అదే ఏడాది నవంబరులో భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని