అందుబాటులోకి సుప్రీంకోర్టు యాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.0

సుప్రీంకోర్టు మొబైల్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.0 బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. న్యాయవాదులతో పాటు న్యాయాధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల నోడల్‌ అధికారులు ఈ యాప్‌ ద్వారా కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించొచ్చు.

Published : 08 Dec 2022 04:40 IST

దిల్లీ: సుప్రీంకోర్టు మొబైల్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.0 బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. న్యాయవాదులతో పాటు న్యాయాధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల నోడల్‌ అధికారులు ఈ యాప్‌ ద్వారా కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించొచ్చు. కేసులు, తీర్పుల వివరాలను తెలుసుకోవచ్చు. యాప్‌ ఆవిష్కరణ విషయాన్ని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలియజేశారు. వారం రోజుల్లో ఐవోఎస్‌ వెర్షన్‌నూ విడుదల చేయనున్నట్లు చెప్పారు.  కొవిడ్‌ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు.. అప్పటి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కొందరు విలేకర్లకు కూడా దానిద్వారా విచారణలను వీక్షించే అవకాశం కల్పించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని