ఏడేళ్ల క్రితం చనిపోయిన యువతి.. అదిగో ఆమే
క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే సంఘటన ఒకటి ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సుమారు ఏడేళ్ల క్రితం మరణించినట్లు అందరూ పేర్కొన్న యువతిని నిందితుడి తల్లి తాజాగా గుర్తించడం తీవ్ర సంచలనం సృష్టించింది.
గుర్తించిన నిందితుడి తల్లి
యూపీలో క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే ఘటన
లఖ్‌నవూ: క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే సంఘటన ఒకటి ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సుమారు ఏడేళ్ల క్రితం మరణించినట్లు అందరూ పేర్కొన్న యువతిని నిందితుడి తల్లి తాజాగా గుర్తించడం తీవ్ర సంచలనం సృష్టించింది. గోండా జిల్లా కేంద్రంలో 2015లో 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమె తండ్రి ఈ విషయమై గోండా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆగ్రాలో ఓ యువతి హత్యకు గురవగా, గోండా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతి తండ్రి అక్కడకు వెళ్లి.. ఆమె తన కుమార్తేనని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసులో హత్యకు సంబంధించిన సెక్షన్‌ని సైతం జోడించారు. ఈ కేసులో విష్ణు (ప్రస్తుతం 25 ఏళ్లు) అనే యువకుడిపై అభియోగాలు మోపడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తన కుమారుడు జైలుకు వెళ్లడానికి కారణమైన యువతి బతికే ఉంటుందని నమ్మిన విష్ణు తల్లి అప్పటి నుంచి కనిపించిన ప్రతి అమ్మాయిని క్షుణ్నంగా పరిశీలించేవారు. తన కుమారుడు నిర్దోషని నిరూపించేందుకు ఏడేళ్లుగా పరితపించారు. గతంలో అదృశ్యమైన యువతి (ప్రస్తుతం 22 ఏళ్లు)ని హాథ్రస్లో గుర్తించిన విష్ణు తల్లి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఆమెను వారు అదుపులోకి తీసుకున్నారు. అలీగఢ్ న్యాయస్థానంలో హాజరు పరిచారు. డీఎన్ఏ పరీక్షల కోసం యువతితోపాటు ఆమె తల్లిదండ్రుల నమూనాలనూ సేకరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
-
World News
Flight: 13 గంటలు ప్రయాణించి.. టేకాఫ్ అయిన చోటే దిగిన విమానం..!