Mamata Banerjee : స్పెయిన్‌ పర్యటనలో దీదీ, గంగూలీ భేటీ

ప్రస్తుతం స్పెయిన్‌ (Spain) పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) భారత మాజీ క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీతో సమావేశమయ్యారు.

Published : 15 Sep 2023 19:10 IST

మాడ్రిడ్‌: స్పెయిన్‌ (Spain) పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం మాడ్రిడ్‌లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీతో (Sourav Ganguly) సమావేశమయ్యారు. ప్రముఖ స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ అయిన లా లిగా అధికారులతో ఇరువురూ భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో ఫుట్ బాల్ అకాడమీని నిర్మించేందుకు బెంగాల్‌ ప్రభుత్వం, లా లిగా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో మమతా బెనర్జీ, లా లిగా ప్రెసిడెంట్ జేవియర్‌ టెబాస్‌, గంగూలీ, కోల్‌కతా ఫుట్‌బాల్ దిగ్గజం మెహన్‌ బగాన్‌, బెంగాల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌కు హాజరు కావాలని టెబాస్‌ను దీదీ ఆహ్వానించారు.

జైహింద్ నాన్న.. కర్నల్ అంత్యక్రియల్లో పసిబిడ్డల కళ్లనిండా అమాయకత్వమే..!

‘ఈ అవగాహన ఒప్పందం క్రీడాస్ఫూర్తి , యువత ప్రతిభను ప్రోత్సాహించడానికి ఎంతో దోహదపడుతుంది. దీంతో లా లిగా పశ్చిమ బెంగాల్‌లో ఫుట్ బాల్ శిక్షణ అకాడమీని అభివృద్ధి చేస్తుంది’ అని పశ్చిమ బెంగాల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి పెదవి విప్పని గంగూలీ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి  విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని