వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

వేలూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.

Published : 04 May 2024 05:30 IST

చెన్నై (వేలూర్‌), న్యూస్‌టుడే: వేలూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. హరియాణాకు చెందిన రూపిందర్‌ సింగ్‌ ప్రథమ, రాజస్థాన్‌కు చెందిన భానుమహేష్‌ ద్వితీయ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేదాంత్‌ తృతీయ స్థానాలు సాధించారు. ఫలితాలను https://ugresults.vit.ac.in/viteee, www.vit.ac.in వెబ్‌సైట్‌లలో చూసుకోవాలని, వేలూర్‌, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌, భోపాల్‌ వీఐటీలలో ప్రవేశాలు జరుగుతాయని వీఐటీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని