Mamata Banerjee: మమతా బెనర్జీకి తీవ్ర గాయం..!

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలకు తీవ్ర గాయమైంది.

Updated : 14 Mar 2024 23:20 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerje)కి తీవ్ర గాయమైంది. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. దీదీ కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. సీఎం ప్రస్తుతం కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే గాయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  తెదేపా అధినేత చంద్రబాబు, రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కోలుకోవాలంటూ భాజపా పశ్చిమ బెంగాల్‌ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ పేర్కొన్నారు.

జనవరిలోనూ ఓ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్‌ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్‌షీల్డ్‌కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని