న్యూస్‌ ఛానెల్‌లో అశ్లీల వీడియో ప్రసారం.. వీక్షకులు షాక్‌!

అమెరికాలోని వాషింగ్టన్‌ నగరం.. సాయంత్రం ఆరవుతోంది. ఓ స్థానిక వార్తా ఛానెల్‌లో ఇద్దరు యాంకర్లు నగర వాతావరణ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఇదంతా చూస్తున్న వీక్షకులు కొద్ది సేపటికే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు! కారణం.. ఆ ఛానెల్‌లో అనుకోకుండా...

Updated : 21 Oct 2021 18:09 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని వాషింగ్టన్‌ నగరం.. సాయంత్రం ఆరవుతోంది. ఓ స్థానిక వార్తా ఛానెల్‌లో ఇద్దరు యాంకర్లు నగర వాతావరణ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.  కొద్ది సేపటికే  వీక్షకులు  ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు! కారణం.. ఆ ఛానెల్‌లో అనుకోకుండా అశ్లీల వీడియో ఒకటి ప్రసారం కావడమే. అమెరికాకు చెందిన టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ వార్తాసంస్థ ‘క్రెమ్‌ 2’లో సాయంత్రం ఆరు గంటల బులెటిన్‌లో 13 సెకన్లపాటు ఈ వీడియో ప్రసారమైంది. గత ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె వెనుక ఉన్న తెరపై అశ్లీల వీడియో ప్రారంభమైంది. అయితే.. ఆమె గానీ, ఆమె సహ యాంకర్ గానీ ఈ విషయాన్ని గుర్తించలేదు. 
చివరకు తన తప్పును తెలుసుకున్న ఆ ఛానెల్.. రాత్రి 11 గంటల సమయంలో ఈ విషయమై క్షమాపణలు చెప్పింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్త వహిస్తామని పేర్కొంది. ‘క్రెమ్‌ 2’ మాతృ సంస్థ టీఈజీఎన్‌ఏ చీఫ్‌ కమ్యూనికేషన్‌ అధికారి అన్నే బెంట్లీ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా.. వీక్షకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని