Viral Video: డీజే ఆపేసిన పోలీసులు.. ‘ఓలా’ మ్యూజిక్‌తో పెళ్లి కూతురు డ్యాన్స్‌

పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్‌లో పోలీసులు డీజేను ఆపడంతో ‘ఓలా’ మ్యూజిక్‌తో పెళ్లి కూతురు డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.  

Published : 13 Jan 2024 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలి కాలంలో ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్లు వేడుకగా జరుగుతున్నాయి. హల్దీ, సంగీత్‌ అంటూ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో అకస్మాత్తుగా అంతరాయం కలిగితే అక్కడికి వచ్చిన వారు తీవ్ర నిరాశకు గురవుతారు. ఇలాంటి ఘటనే ఓ పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. సంగీత్‌ కార్యక్రమంలో డీజే బాక్స్‌లతో హుషారుగా డ్యాన్సులు చేస్తున్న వేళ.. సమయం దాటిపోయిందని పోలీసులు అడ్డుకోవడంతో పెళ్లి కూతురు తీవ్ర నిరాశకు గురైంది. దీంతో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచించి వేడుకను కొనసాగించడంతో ఆమె ఆనందపడింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజెన్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ప్రస్తుతం అది వైరల్‌ అవుతోంది.  

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌ కోసం ఓ పెళ్లి కూతురు ప్రత్యేకంగా డ్యాన్స్‌ నేర్చుకుంది. అయితే సమయం మించిపోయిందని, డీజే ఆపాలని పోలీసులు ఆదేశించడంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర నిరాశకు లోనైంది. దీంతో అప్పటికప్పుడు మ్యూజిక్‌ సిస్టం ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని అక్కడికి తీసుకొచ్చి కార్యక్రమాన్ని కొనసాగించడంతో ఆమె ఊపిరిపీల్చుకుంది. చివరికి ఆమె డ్యాన్స్‌తో ఆ కార్యక్రమం ముగియసింది. దీంతో పెళ్లి కూతురు సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ వీడియో పలువురు సోషల్‌ మీడియా యూజర్లతో పాటు ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ని ఆకర్షించింది. దీంతో వెంటనే ఆయన స్పందించారు. ‘మన సంస్కృతిలో ఓలా స్కూటర్‌లు భాగమైనందుకు సంతోషంగా ఉంది. క్రియేటివిటీ ఇలాగే కొనసాగిలి’’ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ ఎలక్ట్రిక్‌ వాహనాల రాకతో ఆ సమస్యను ఎదుర్కోవడానికి వీలుపడుతోంది. ఇక ఈవీ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఫీచర్లతో మార్కెట్‌లోకి దూసుకొస్తున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని