Joint pains: చలికాలంలో కీళ్ల నొప్పులా?

కొందరికి చలికాలంలో కీళ్ల నొప్పుల వంటివి ఎక్కువవుతుంటాయి. దీనికి కచ్చితమైన కారణమేంటన్నది ఇప్పటికీ తెలియదనే చెప్పుకోవాలి. ఆయా వాతావరణాల్లో గాలి ఒత్తిడి మార్పులు కీళ్ల నొప్పుల భావనలను ప్రేరేపిస్తుండొచ్చని భావిస్తుంటారు.

Updated : 08 Nov 2022 09:51 IST

కొందరికి చలికాలంలో కీళ్ల నొప్పుల వంటివి ఎక్కువవుతుంటాయి. దీనికి కచ్చితమైన కారణమేంటన్నది ఇప్పటికీ తెలియదనే చెప్పుకోవాలి. ఆయా వాతావరణాల్లో గాలి ఒత్తిడి మార్పులు కీళ్ల నొప్పుల భావనలను ప్రేరేపిస్తుండొచ్చని భావిస్తుంటారు. శరీరం చుట్టుపక్కల గాలి ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు కీళ్ల చుట్టూరా కండరాలు, కండర బంధనాలు, ఇతర కణజాలాలు వ్యాకోచిస్తాయి. ఇది కీళ్ల మీద ఒత్తిడిని పెంచటం వల్ల నొప్పి కలగొచ్చు.

చలికాలంలో మన జీవనశైలి మారటమూ కీళ్ల నొప్పులను తీవ్రం చేయొచ్చు. ఉదాహరణకు- చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఎక్కువసేపు ఇంట్లోనే ఉండిపోవచ్చు. ఏ సినిమానో చూస్తూ సోఫాలో అలాగే గంటల కొద్దీ కూర్చోవచ్చు. దీంతో కీళ్లు బిగుసుకుపోతాయి. నొప్పీ ఎక్కువ అవుతుంది. వాతావరణం మారిపోయినప్పుడు కొందరికి అసౌకర్యంగానూ అనిపిస్తుంది. ఫలితంగా మిగతా సమయాల్లో కన్నా అప్పుడే కీళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తున్నట్టు అనిపించొచ్చు.

మరి ఇలాంటి వాతావరణంతో ముడిపడిన కీళ్ల నొప్పులను తగ్గించుకోవటం ఎలా? ఎక్కువసేపు కూర్చోకుండా చూసుకోవటమే. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలను సాగదీసే వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts