Smart Phones Large battery: బడ్జెట్‌ ధరలో బిగ్‌ ‘బ్యాటరీ’ ఫోన్లు

 స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ గంటలు పని చేయాలంటే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉండాలి. ఇటీవల విడుదలవుతున్న మొబైల్స్‌లోనూ ఎక్కువగా 5000 mAhకిపైగా సామర్థ్యం కలిగిన బ్యాటరీలను..

Published : 04 Aug 2021 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్స్‌ రాకతో గేమ్స్, మెసేజెస్‌, యూట్యూబ్, ఫోన్‌ మాట్లాడటం పెరిగిపోయింది. అయితే స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ గంటలు పని చేయాలంటే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉండాలి. ఇటీవల విడుదలవుతున్న మొబైల్స్‌లోనూ ఎక్కువగా 5000 mAhకిపైగా సామర్థ్యం కలిగిన బ్యాటరీలను వినియోగిస్తున్నాయి కంపెనీలు. బడ్జెట్‌ రేట్‌లో మంచి బ్యాటరీ లైఫ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ లైఫ్‌తోపాటు ఇతర ఫీచర్లలో ఎలాంటి కాంప్రమైజ్‌ లేకుండా సరసమైన ధరల్లో లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌ వేదికలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. మరి అలాంటి కొన్ని మొబైల్‌ ఫోన్ల గురించి తెలుసుకుందాం..! 

6000 mAh బ్యాటరీతో పోకో

* పోకో M3
* మెమొరీ: 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్‌.. ఎక్సాండబుల్‌ 512 జీబీ
* ప్రాసెసర్‌: క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 662
* కెమెరా: 48 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ+ 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
* బ్యాటరీ: 6000 mAh లిథియమ్‌ ఐయాన్‌ పాలీమర్‌ బ్యాటరీ
* డిస్‌ప్లే: 6.53 అంగుళాలు
* ధర: రూ. 11,499


రెడ్‌మీ నోట్ 10

* ప్రాసెసర్‌: క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 678 
* ఓఎస్: ఆండ్రాయిడ్ వెర్షన్‌ 11
* బ్యాటరీ: 5000 mAh, 33W ఫాస్ట్‌ ఛార్జర్‌
* డిస్‌ప్లే:  6.43 అంగుళాలు
* కెమెరా: 48 ఎంపీ క్వాడ్‌ రేర్ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ + 2 ఎంపీ మాక్రో +13 ఎంపీ ఫ్రంట్‌ 
* మెమొరీ: 4 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్.. ఎక్సాండబుల్‌ 512 జీబీ
* ధర : రూ. 12,999


రెడ్‌మీ నోట్‌ 10S

* ప్రాసెసర్‌: మీడియాటెక్ హీలియో G95 ఆక్టా-కోర్
* ఓఎస్‌: ఎఐయూఐ 12
* డిస్‌ప్లే: 6.43 అంగుళాల అమోఎల్‌ఈడీ
* బ్యాటరీ: 5000 mAh, 33W ఫాస్ట్‌ ఛార్జర్‌
* కెమెరా: 64 ఎంపీ క్వాడ్‌ రేర్‌+ 8ఎంపీ అల్ట్రా వైడ్‌ + 2 ఎంపీ మాక్రో + 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
* మెమొరీ: 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌.. ఎక్సాండబుల్‌ 512 జీబీ
* ధర: రూ.14,999


ఒప్పో A54 

* ప్రాసెసర్‌: మీడియాటెక్ హీలియో P35
* ఓఎస్‌: ఆండ్రాయిడ్ 10
* ఫోన్‌ డిస్‌ప్లే: 6.51 అంగుళాల హెచ్‌డీ+
* బ్యాటరీ సామర్థ్యం: 5000 mAh
* ఓఎస్‌: ఆండ్రాయిడ్ 10
* కెమెరా: 13 ఎంపీ మెయిన్‌ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ బోకే లెన్స్ + 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
* మెమొరీ: 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్.. ఎక్సాండబుల్‌ 256 జీబీ
* ధర: రూ. 13,999


రియల్‌మీ నార్జో 30

* ప్రాసెసర్‌: మీడియా టెక్ హీలియో G95
* ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 11
* మెమొరీ, ర్యామ్‌: 4 జీబీ / 64 జీబీ.. ఎక్సాండబుల్‌ 256 జీబీ
* బ్యాటరీ: 5000 mAh
* కెమెరా: 48 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ+16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
* డిస్‌ప్లే: 6.5 అంగుళాలు
* ధర: రూ. 14,350 


శాంసంగ్‌ గెలాక్సీ ఎం 11

* ప్రాసెసర్: SDM450-F01 ఆక్టా కోర్
* ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10
* కెమెరా: 13 ఎంపీ+5 ఎంపీ+ 2 ఎంపీ+ ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌
* డిస్‌ప్లే: 6.4 అంగుళాలు
* మెమొరీ: 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్
* బ్యాటరీ: 5000 mAh లిథియమ్‌ ఐయాన్‌ బ్యాటరీ
* ధర: రూ. 10,499


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు