Nothing Ear 1: నథింగ్ కొత్త ఇయర్‌బడ్స్‌.. ధర, ఫీచర్లివే! 

నథింగ్ కంపెనీ కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని క్రిప్టో కరెన్సీ సాయంతో కూడా కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే భారత్‌లో క్రిప్టో కరెన్సీతో కొనుగోలు చేసే సదుపాయం లేదని వెల్లడించింది. 

Published : 03 Dec 2021 01:25 IST


ఇంటర్నెట్‌డెస్క్‌: నథింగ్‌ కంపెనీ కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నథింగ్ ఇయర్‌ 1 బ్లాక్‌ ఎడిషన్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నథింగ్ ఇయర్‌ 1 వైట్ ఎడిషన్‌కు కొనసాగింపుగా ఈ మోడల్‌ కంపెనీ పరిచయం చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభంకానున్నాయో చూద్దాం. 

నథింగ్ ఇయర్‌ 1 ఫీచర్స్‌

నథింగ్ ఇయర్‌ 1లో యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తోపాటు మూడు హై డెఫినిషన్ మైక్‌లు ఉన్నాయి. ఇందులో నాయిస్‌ క్యాన్సిలేషన్ తీవ్రతను ఇయర్ 1 యాప్‌ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇందులో 11.6 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఇస్తున్నారు. ఇయర్‌బడ్స్‌ని ఛార్జ్‌ చేసేందుకు యూఎస్‌బీ-సీ టైప్ ఛార్జర్‌ ఇస్తున్నారు. ఇది క్యూఐ వైరస్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇయర్‌బడ్స్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5.7 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్‌ కేస్‌తో 34 గంటలపాటు బ్యాటరీ స్టాండ్‌బైలో ఉంటుంది. వీటిని పది నిమిషాలు ఛార్జ్ చేస్తే 8 గంటలపాటు మ్యూజిక్‌ని ఆస్వాదించవచ్చని నథింగ్ తెలిపింది.

ధర

భారత మార్కెట్లో వీటి ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబరు 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌ను క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చని నథింగ్ తెలిపింది. ఈథేరెమ్‌ (ETH), యూఎస్‌డీ కాయిన్‌ (USDC), బిట్‌కాయిన్‌ (BTC), డోగేకాయిన్‌ (DOGE) వంటి డిజిటల్‌ కరెన్సీని ఉపయోగించి నథింగ్.టెక్‌ వెబ్‌సైట్‌ నుంచి ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. భారత్‌లో మాత్రం క్రిప్టో కరెన్సీతో కొనుగోలు చేసే సదుపాయం లేదు. 

Read latest Gadgets & Technology News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని