NTR: ఛాంపియన్‌గా?

ఎన్టీఆర్‌ కొత్త చిత్రం దాదాపుగా ఖరారైనట్టే. వచ్చే నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో త్వరలోనే సందడి చేయనున్న ఎన్టీఆర్‌... ఆ తర్వాత కొరటాల శివ సినిమా కోసం

Published : 14 Mar 2022 15:18 IST

న్టీఆర్‌ కొత్త చిత్రం దాదాపుగా ఖరారైనట్టే. వచ్చే నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో త్వరలోనే సందడి చేయనున్న ఎన్టీఆర్‌... ఆ తర్వాత కొరటాల శివ సినిమా కోసం రంగంలోకి దిగుతారు. దీంతోపాటు ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా కథకీ ఎన్టీఆర్‌ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. వచ్చే నెల 11న అధికారికంగా ప్రకటన వెలువడనుందనేది పరిశ్రమ వర్గాలు మాట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కబడ్డీ ఛాంపియన్‌గా కనిపించనున్నారు. కోచ్‌గానూ ఆయన తెరపై సందడి చేయనున్నారని తెలిసింది. ‘పెద్ది’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నట్టు తెలిసింది. దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని