సినిమా విడుదలయ్యే వరకూ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌!

నేటి ఆధునిక కాలంలో ఫోన్‌ లేకుండా జీవించడం కష్టమే. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి  తమ ఫోన్‌ చెక్‌ చేసుకునేవారే

Published : 02 Feb 2021 22:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నేటి ఆధునిక కాలంలో ఫోన్‌ లేకుండా జీవించడం కష్టమే. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి  తమ ఫోన్‌ చెక్‌ చేసుకునేవారే అధికమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సెల్‌ఫోన్‌ లేకుండా కొన్ని రోజుల పాటు ఉండటం సాధ్యమేనా? అంటే నేను చేసి చూపుతా.. అంటున్నారు బాలీవుడ్‌ ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ ఆమీర్‌ఖాన్‌. ఆయన కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్‌ మళ్లీ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో సినిమాను వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు ఆమీర్‌. అంతేకాదు, సినిమా విడుదలయ్యే వరకూ తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

ఇదీ కారణం..:సినిమా చిత్రీకరణ సీరియస్‌గా సాగుతున్న సమయంలో తరచూ కాల్స్‌, సందేశాలు వస్తున్నాయట. దీంతో తన పాత్రపై దృష్టి పెట్టలేకపోతున్నారట ఆమీర్‌. అందుకే సినిమా విడుదలయ్యే వరకూ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నట్లు సన్నిహితులతో అన్నారట. సినిమా, అందులోని పాత్ర కోసం ఆమీర్‌ ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయంతో మరోసారి ఆయన అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకొన్నారు. లాల్‌సింగ్‌ చద్దా చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని