aa okkati adakku: ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్‌

పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్‌ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా?

Updated : 23 Apr 2024 09:44 IST

పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్‌ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం చూడాల్సిందే. అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్‌ చిలక నిర్మాత. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. కథానాయకుడు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ ‘‘చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కామెడీ సినిమాతో వస్తున్నా. ఈ వేసవిలో ప్రేక్షకులందరినీ బాగా నవ్విస్తాం. దాంతోపాటు, మంచి కథని కూడా చెబుతున్నాం’’ అన్నారు. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకి బదులిస్తూ... ‘సుడిగాడు 2’ కోసం కథ సిద్దమవుతోందని, వచ్చే ఏడాది కోసం ప్రణాళికలో ఉందని తెలిపారు అల్లరి నరేశ్‌. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ‘‘సిద్ధి అనే పాత్రలో కనిపిస్తా. చిట్టి చిట్టి అని పిలిచినట్టే, ఇకపై సిద్ధి అని పిలిస్తే బాగుంటుందేమో’’ అన్నారు. ‘‘నరేశ్‌తో పనిచేయడం మంచి అనుభవం. దర్శకుడు మల్లి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు చాలా బాగుంది’’ అన్నారు నిర్మాత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు