నువ్వా... నేనా!

నువ్వు ఒక బుల్లెట్‌ దింపితే...నేను పది బుల్లెట్లు దింపుతా అనేలా ఉంది కదూ ఈ ఫొటో. ఇద్దరు స్టార్‌ కథానాయకులు....విలన్‌ తరహా పాత్రల్లో నటిస్తున్నారు. నువ్వా నేనా అనేలా పోటీపడి నటించారు. ఆ చిత్రమే ‘విక్రమ్‌ వేద’. గ్యాంగ్‌స్టర్‌కు,

Updated : 16 Sep 2022 06:19 IST

నువ్వు ఒక బుల్లెట్‌ దింపితే...నేను పది బుల్లెట్లు దింపుతా అనేలా ఉంది కదూ ఈ ఫొటో. ఇద్దరు స్టార్‌ కథానాయకులు....విలన్‌ తరహా పాత్రల్లో నటిస్తున్నారు. నువ్వా నేనా అనేలా పోటీపడి నటించారు. ఆ చిత్రమే ‘విక్రమ్‌ వేద’. గ్యాంగ్‌స్టర్‌కు, పోలీస్‌ అధికారికి మధ్య సాగే పోరాటమే ఈ చిత్రం. గ్యాంగ్‌స్టర్‌  వేదగా హృతిక్‌ రోషన్‌...పోలీస్‌ అధికారి విక్రమ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. తమిళంలో ఇదే పేరుతో తెరకెక్కిన చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్‌ గాయత్రి ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ప్రత్యేక పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సెప్టెంబరు 30న ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


5డీలో ‘మహాభారత్‌’

హాభారతాన్ని ఎన్నిసార్లు ఏ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినా అద్భుతంగానే ఉంటుంది. ఈ గొప్ప ఇతిహాసాన్ని ‘మహాభారత్‌’గా నిర్మించారు ఏజీ నడియాడ్‌వాలా. అప్పట్లో ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆయన తనయుడు ఫిరోజ్‌ నడియాడ్‌వాలా మహాభారత కథని 5డీలో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారని తెలుస్తోంది. దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు, దీని కోసం గత నాలుగేళ్లుగా స్క్రిప్పు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని హిందీలో నిర్మించి తర్వాత పలు భాషల్లోకి అనువదించి 2025 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవ్‌గణ్‌, రణ్‌వీర్‌సింగ్‌ లాంటి స్టార్‌ నటులు నటించనున్నట్లు కూడా బాలీవుడ్‌లో వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని