Pooja Hegde: రవితేజ సరసన పూజా హెగ్డే?

‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘ఈగల్‌’ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ... గోపీచంద్‌ మలినేనితో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Updated : 22 Jul 2023 14:07 IST

‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘ఈగల్‌’ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ... గోపీచంద్‌ మలినేనితో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు,  మరో సినిమాకీ రంగం సిద్ధమవుతోంది. ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్న ఆ సినిమాకి సంబంధించిన  పనులు చకచకా సాగుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే అందులో రవితేజ - పూజాహెగ్డే జోడీ కలిసి సందడి చేసే అవకాశాలున్నట్టు తెలిసింది. పూజాహెగ్డే ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ చేయడం లేదు. ఇటీవలే రవితేజ  సినిమా కోసం ఆమెని సంప్రదించినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు