‘సీత’ కోసం కరీనా భారీ డిమాండ్‌..!

ఇటీవల పౌరాణిక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్‌ వెచ్చించి మరీ పౌరాణిక చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్నారు. ఇప్పుడు మరో పౌరాణిక చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. సీతాదేవి కోణం నుంచి రామాయణాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

Published : 09 Jun 2021 21:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల పౌరాణిక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్‌ వెచ్చించి మరీ పౌరాణిక చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్నారు. ఇప్పుడు మరో పౌరాణిక చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. సీతాదేవి కోణం నుంచి రామాయణాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సీత పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ కరీనాకపూర్‌ పోషించనుందట. అయితే.. ఈ చిత్రంలో నటించేందుకు ఆమె షరతులు పెట్టిందట.

ఈ పౌరాణిక చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించనున్నారట. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సీత పాత్రకు కరీనా అయితే న్యాయం చేయగలదని భావించిన చిత్రబృందం ఆమెను సంప్రదించిందట. కాగా.. మామూలు సినిమాల్లో గ్లామరస్‌ పాత్రలు పోషించడానికి సీత పాత్ర పోషించడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో చేయాలంటే రూ.12కోట్లు ఆమె డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు కేవలం 6నుంచి 8కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటోంది.

సీతగా మెప్పించాలంటే అందుకు ముందు నుంచే మానసికంగానూ ఎంతో సన్నద్ధం కావాలి. ఆ తర్వాత మొత్తం షూటింగ్‌ పూర్తయ్యే సరికి కనీసం 8 నుంచి 10 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకూ మరో చిత్రం చేయడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంతటి భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్రబృందం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని