Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన ‘రంగం’ బ్యూటీ

‘రంగం’ (Rangam) ఫేమ్‌ కార్తిక నాయర్‌ (Karthika Nair) త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఆమె పోస్ట్‌ పెట్టారు.

Published : 15 Nov 2023 13:16 IST

ఇంటర్నెట్‌డెస్క్: సీనియర్‌ నటి రాధ (Radha) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే అభిమానులను సొంతం చేసుకున్నారు ముద్దుగుమ్మ కార్తిక నాయర్‌ (Karthika Nair). దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న ఆమె పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

గత నెలలో ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ షేర్‌ చేసి ఆశ్చర్యపరిచిన ఆమె.. తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్‌ మేనన్‌ను పరిచయం చేసింది. అతడితో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్‌.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభించా’’ అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Kriti Sanon: గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి.. నెపోటిజంపై కృతిసనన్‌

2009లో తెరకెక్కిన ‘జోష్‌’తో కార్తిక హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2011లో విడుదలైన ‘రంగం’తో ఆమె విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించారు. ‘దమ్ము’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 2015 తర్వాత నుంచి కార్తిక వెండితెరకు దూరంగా ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని