Naa Saami Ranga: అంజి... నా సామిరంగ

‘చేసెయ్‌ చేసెయ్‌... లేదంటే మాటొచ్చేత్తది’ అంటూ అంజి సందడి మొదలుపెట్టాడు. మాటకి అంత విలువనిచ్చే అతని కథేమిటో తెలియాలంటే ‘నా సామిరంగ’ చూడాల్సిందే. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది.

Updated : 16 Dec 2023 09:26 IST

‘చేసెయ్‌ చేసెయ్‌... లేదంటే మాటొచ్చేత్తది’ అంటూ అంజి సందడి మొదలుపెట్టాడు. మాటకి అంత విలువనిచ్చే అతని కథేమిటో తెలియాలంటే ‘నా సామిరంగ’ చూడాల్సిందే. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేశ్‌... అంజి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రని ఓ ప్రత్యేక ప్రచార చిత్రంతో పరిచయం చేశారు. మాటొచ్చేత్తది మాటొచ్చేత్తది... అంటూ నాగార్జునతో కలిసి చేసిన సరదా సందడి ప్రచార చిత్రంలో కనిపిస్తుంది. టీజర్‌ని త్వరలోనే విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరథి, సాహిత్యం: చంద్రబోస్‌, సమర్పణ: పవన్‌ కుమార్‌, కథ, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు